యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగశౌర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘లక్ష్య’. సుమంత్ తో ‘సుబ్రహ్మణ్యపురం’ అనే యావరేజ్ చిత్రాన్ని తెరకెక్కించిన సంతోష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకుడు. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని… సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్ల పై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు నిర్మించారు. టీజర్, ట్రైలర్ లు ఓకే అనిపించాయి. కానీ ‘అఖండ’ ఎఫెక్ట్ అనుకుంట.. ఈ చిత్రానికి బిజినెస్ ఓ మోస్తరుగా మాత్రమే జరిగింది.
ఒకసారి బిజినెస్ వివరాలను గమనిస్తే :
నైజాం
2.78 cr
సీడెడ్
1.42 cr
ఆంధ్రా(టోటల్)
1.90 cr
ఏపి+తెలంగాణ (టోటల్)
6.10 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
+ ఓవర్సీస్
0.38 cr
వరల్డ్ వైడ్ టోటల్
6.48 cr
‘లక్ష్య’ చిత్రానికి రూ.6.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం క్లీన్ హిట్ స్టేటస్ ను దక్కించుకోవాలి అంటే రూ.6.60 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ‘అఖండ’ మ్యానియా వల్ల చిన్న సినిమాలను జనాలు పట్టించుకోవడం లేదు.’లక్ష్య’ ని పట్టించుకుంటరా అనేది ఒక ప్రశ్న అయితే.. పోటీగా ‘గమనం’ అనే మరో చిన్న సినిమా ఉంది.