యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగశౌర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘లక్ష్య’. సుమంత్ తో ‘సుబ్రహ్మణ్యపురం’ అనే యావరేజ్ చిత్రాన్ని తెరకెక్కించిన సంతోష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకుడు. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల అయిన ‘లక్ష్య’ చిత్రానికి యవరేజ్ టాక్ అయితే వచ్చింది కానీ ఓపెనింగ్స్ మాత్రం చాలా దారుణంగా నమోదయ్యాయి. ‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని… సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్ల పై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు నిర్మించారు.
‘లక్ష్య’ ఫస్ట్ వీక్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
నైజాం | 0.62 cr |
సీడెడ్ | 0.23 cr |
ఉత్తరాంధ్ర | 0.26 cr |
ఈస్ట్ | 0.12 cr |
వెస్ట్ | 0.09 cr |
గుంటూరు | 0.14 cr |
కృష్ణా | 0.17 cr |
నెల్లూరు | 0.07 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.70 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.12 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.84 cr |
‘లక్ష్య’ చిత్రానికి రూ.6.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం క్లీన్ హిట్ స్టేటస్ ను దక్కించుకోవాలి అంటే రూ.6.60 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.మొదటివారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.1.84 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.4.46 కోట్ల షేర్ ను రాబట్టాలి. చూస్తుంటే అది అసాధ్యమనిపిస్తుంది. ‘అఖండ’ తర్వాత జనాలంతా ‘పుష్ప’ వంటి మరో పెద్ద సినిమా కోసమే ఎదురుచూసారు. మధ్యలో మరో చిన్న లేదా మీడియం రేంజ్ సినిమాకి టికెట్ కొనుక్కుని వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించలేదని ‘లక్ష్య’ తో ప్రూవ్ అయ్యింది.
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!