Lakshya Movie: టికెట్ రేట్ల ఇష్యు పై ‘లక్ష్య’ నిర్మాత కామెంట్స్..!

యంగ్ హీరో నాగ శౌర్య నుండీ రాబోతున్న స్పోర్ట్స్ డ్రామా ‘లక్ష్య’. ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కాబోతుంది. కేతిక శర్మ హీరోయిన్ కాగా కాల భైరవ సంగీతం అందించాడు. ‘శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి’ ‘నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ల పై నారాయణదాస్ నారంగ్,పుస్కుర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. కాగా ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా నిర్మాత పుస్కుర్ రామ్మోహనరావు పాల్గొని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.

నాగశౌర్య ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడని.. ఆర్చర్ గా అతని లుక్ బాగా సెట్ అయ్యింది. హీరోయిన్ కేతిక కూడా బాగా చేసింది.నిజానికి ‘లక్ష్యం’ అనే టైటిల్ ను పెట్టాలనుకున్నాం కానీ ఆల్రెడీ ఆ పేరుతో గోపీచంద్ గారి హిట్ సినిమా ఉంది కాబట్టి.. ‘లక్ష్య’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసాం. ‘లవ్ స్టోరీ’ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మా సినిమా ఇలాంటి టఫ్ టైములో కూడా అంత కలెక్ట్ చేస్తుందని ఊహించలేదు. ప్రేక్షకులకు థాంక్స్ చెప్పుకోవాలి. ‘అఖండ’ కూడా మంచి విజయం సాధించింది. జనాలు థియేటర్లకు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఈ సినిమా స్పష్టంచేసింది.

కాకపోతే టికెట్ రేట్ల ఇష్యు పై కూడా ఏపి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే బాగుంటుంది. ఆన్లైన్ పోర్టల్ ను తీసుకురావాలని చెప్పింది మేమె. దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ టికెట్ రేట్లు అంత ఘోరంగా తగ్గించేస్తే నిర్మాత ఏ ధైర్యంతో సినిమా చేస్తాడు. మహారాష్ట్రాలో టికెట్ రేట్లు రిలీజ్ టైములో అయితే రూ.1000, రూ.500 అలా ఉంటాయి. వీక్ డేస్ లో రూ.300 కనీసం ఉంటాయి. అలా లేకపోతే థియేటర్లు రన్ చేయడం అన్నది కష్టమైపోతుంది. ఆంధ్రలో కొన్ని చోట్ల రూ.10 టికెట్ రేటు ఉంది. ఆ రేటుకి ఈరోజుల్లో కప్పు టి.. రావడమే గగనంగా ఉంది. ఇంత దారుణమైన పరిస్థితి నుండీ ప్రభుత్వం మమ్మల్ని బయటపడేయాలని విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!</strong

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus