Lal Salaam: ఇండియన్‌ సినిమాల బ్యాన్‌… రీసెంట్‌ టైమ్స్‌లో రెండో సినిమా బ్యాన్‌… ఎక్కడంటే?

ఇండియన్‌ సినిమాలకు విదేశాల్లోనూ ఫ్యాన్‌ బేస్‌ ఉందనే విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా మన సినిమాలు అక్కడ రిలీజ్‌ అవుతున్నాయి, భారీ విజయం అందుకుంటున్నాయి కూడా. అయితే ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు అరబ్‌ దేశాల్లో విడుదల కావడం లేదు. ఆ సినిమాలపై ఆయా దేశాల్లో నిషేధం విధిస్తున్నారు. కారణాలు పూర్తిగా బయటకు చెప్పకపోయినా మన సినిమాలు అయితే నిషేధాన్ని ఎదుర్కొంటున్నాయి. తాజాగా రజనీకాంత్‌ కీలక పాత్ర పోషించిన ‘లాల్‌ సలామ్‌’ కూడా బ్యాన్‌ అయ్యింది అని సమాచారం.

రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘లాల్ సలామ్’. స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా మత కల్లోలాలు ప్రధానంగా సాగుతుంది అని సమాచారం. ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాల్లో ఈ వాసనలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 9న విడుదల కావాల్సిన సినిమాను కొన్ని దేశాలు రిలీజ్‌ చేయడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. కువైట్‌లో ఈ సినిమాను బ్యాన్ చేశారని ప్రాథమిక సమాచారం.

కువైట్, కతార్‌ దేశాల్లో విదేశీ సినిమాల విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటున్నాయి. కంటెంట్‌లో ఏ మాత్రం ఇబ్బంది అవుతుంది అనిపించినా వెంటనే ఆంక్షలు విధించేస్తున్నారు. మొన్నటికి మొన్న హృతిక్‌ రోషన్‌ – దీపిక పడుకొణె సినిమా ‘ఫైటర్‌’ను ఆయా దేశాల్లో రిలీజ్‌ చేయలేదు. ఇప్పుడు ‘లాల్‌ సలామ్‌’ సినిమా విషయంలోనూ ఇదే నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. అంతేకాదు మిడిల్ ఈస్ట్‌లో ఇలాంటి సెన్సిటివ్ సినిమాలు సెన్సార్ కష్టమే అని తేల్చేస్తున్నారు.

‘జైలర్‌’ సినిమాతో గతేడాది అలరించిన రజనీ ‘లాల్ సలామ్’ సినిమాతో అలరించేందుకు రెడీ అయ్యారు. అయితే అది అతిథి పాత్రలోనే అనే విషయం మరచిపోకూడదు. సుమారు 30 నిమిషాలు ఈ సినిమాఓల తలైవా కనిపిస్తాడట. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు (Lal Salaam) మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో థియేటర్లు అయితే దక్కడం లేదని చెప్పాలి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus