రీసెంట్ బాలీవుడ్ మ్యూజికల్ సెన్సేషన్ రాను మండల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చుగుద్దినట్లు లతా మంగేష్కర్ లా పాడే ఆమెను ప్లాట్ ఫార్మ్ నుంచి స్టూడియో వరకూ వెళ్ళేలా చేసింది సోషల్ మీడియా. తెలుగులో బేబీ కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకొంది రాను మొండల్. అయితే.. ఆమె సంపాదించుకొన్న పాపులారిటీని కొందరు గాసిప్పు రాయుళ్ళు అనవసరమైన విషయాలకు వాడుతున్నారు. సల్మాన్ ఖాన్ ఆమెకు ఇల్లు బహూకరించాడని, తన సినిమాలో పాడే అవకాశం కూడా కల్పించాడని గాలి వార్తలు పుట్టుకొచ్చాయి. అలాగే.. ఏకంగా లతా మంగేష్కర్ స్వయంగా రాను మొండల్ ను ప్రశంసించిందని కూడా ఫోటోలతో సహా వార్తలు రావడం మొదలైంది.
అయితే.. ఇదే విషయమై లతా మంగేష్కర్ ను ప్రశ్నించగా.. “అసలు రాను మోండల్ ఎవరు?, ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఇలాంటి ఫేక్ న్యూస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనే విషయం నాకు తెలియదు. అలాంటి వాళ్లందరికీ ఒకటే చెప్తున్నాను.. దయచేసిన ఇలాంటి అబద్ధపు వార్తలు సృష్టించకండి అని లతా మంగేష్కర్ వేడుకొన్నారు.