బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తన చిరకాల ప్రియురాలు నటాషా దలాల్‌ను ఈ నెల 24న పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ముంబైలోని అలీబాగ్‌లో వీరు ఇరు సంప్రదాయాల ప్రకారం ఒక్కటి కాబోతున్నారు. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోవిడ్ -19 పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని కేవలం 50 మంది అతిథుల సమక్షంలోనే వివాహ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం వివాహం సూర్యాస్తమయ సమయంలో జరగనుందట.
ఈ వేడుకకు కొందరు ప్రముఖ బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం నుంచే వేడుకకు సంబంధించిన పనులు మొదలయ్యాయట. ముఖ్యంగా సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ వంటి స్టార్స్ స్పెషల్ గెస్టులుగా హాజరుకానున్నారని సమాచారం. ఇక జనవరి 26న ఈ జంట బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఇతర సన్నిహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ పార్టీని కూడా నిర్వహించడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ అలాగే అతని సోదరుడు రోహిత్ ధావన్ అలీబాగ్ వద్ద వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.