“గీత గోవిందం, తొలిప్రేమ” చిత్రాలు లావణ్య త్రిపాఠి చేయాల్సినవి అయితే.. ఆమె వాటిని కాదంది. దాంతో ఆ ఆఫర్లు వేరే కథానాయికలు తన్నుకుపోయారని, ఇప్పుడు ఆ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో లావణ్య త్రిపాఠి తెగ బాధపడిపోతుందని నిన్నటి నుండి వరుస కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయమై కాస్త లేట్ గా అయినా గట్టిగానే స్పందించింది లావణ్య త్రిపాఠి. ‘ఫేక్ న్యూస్ అలెర్ట్’ అంటూ ట్వీట్ చేసింది. అనంతరం “కొన్ని రూమర్ల విషయంలో కామ్ గా ఉన్నానంటే దానర్థం నాగురించి ఏదిపడితే అది మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని కాదు” అంటూ ఒక ఇన్ డైరెక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చింది.
ప్రస్తుతం లావణ్య చేతిలో రెండు సినిమాలున్నాయి. నిఖిల్ సరసన “ముద్ర” మరియు వరుణ్ తేజ్ సరసన “అంతరిక్షం” సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలతోపాటు హిందీలోనూ ఒక సినిమా సైన్ చేసిందని వినికిడి. సో, ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా లావణ్య మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లే.