Lavanya Tripathi: మిస్ పర్ఫెక్ట్ గా మెగా కోడలు లావణ్య?

నటి లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకొని మెగా ఇంటి కోడలు అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇలా మెగా ఇంటికోడలుగా అడుగుపెట్టినటువంటి ఈమె ఇప్పటివరకు ఎలాంటి కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదు. అయితే ఈమె పెళ్లికి ముందే పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటించారు. పెళ్లికి ముందు ఒక తమిళ సినిమాతో పాటు మిస్ ఫర్ఫెక్ట్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించారు.

బిగ్ బాస్ సీజన్ ఫోర్ విన్నర్ అభిజిత్ అభిజ్ఞ లావణ్య త్రిపాఠి కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రసారం కాబోతోంది. వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతోంది. ఇకపోతే ఈ సిరీస్ విడుదల తేదీ ప్రకటించకపోయినప్పటికీ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెడుతూ వచ్చారు. అయితే ఈ వెబ్ సిరీస్ గురించి వార్తలు వైరల్ గా మారడంతో మెగా కోడలుగా అడుగుపెట్టిన తర్వాత లావణ్య నటించిన ఈ వెబ్ సిరీస్ మొదట విడుదల కాబోతుంది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈమె ఇదివరకు సినిమాలలోనూ అలాగే వెబ్ సిరీస్లలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇదివరకే (Lavanya Tripathi) లావణ్య త్రిపాఠి పులిమేక అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక త్వరలోనే మరో వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా ఈమె నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus