అందాల రాక్షసిగా చిత్ర సీమలో అడుగు పెట్టి ఆకట్టుకున్న భామ లావణ్య త్రిపాఠి. భలే భలే మగాడివోవ్ చిత్రం తో హిట్ ట్రాక్ లోకి వచ్చిన ఈ సుందరి సోగ్గాడే చిన్ని నాయనలో అందం, అభినయంతో అలరించింది. ఇప్పుడు అల్లు శిరీష్ తో కలిసి శ్రీరస్తు శుభమస్తు అంటూ మనముందుకు వస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో చిరంజీవి చిత్ర దర్శకుడు పరుశురాంని అభినందించారు. మెగాస్టార్ ప్రశంసలు అందుకోవడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి.
ఈ చిత్రం ఈనెల 5 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా లావణ్య మాట్లాడుతూ “నేను ఈ చిత్రంలో కాలేజ్ అమ్మాయిగా నటించాను. అందుకోసం మూడు కిలోలు బరువు తగ్గాను. నా పాత్ర ఇందులో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అల్లు శిరీష్ తో కలిసి పని చేయడం చాలా బాగా ఉన్నింది. ముఖ్యంగా కాశ్మీర్ లోని సోనా మార్గ్ లో షూటింగ్ ని బాగా ఎంజాయ్ చేసాం. అక్కడ సెల్ ఫోన్ కి సిగ్నల్స్ ఉండవు. సో నేను, శిరీష్ కబుర్లు చెప్పుకోవడానికి సమయం చిక్కింది” అని వివరించింది. అల్లు శిరీష్ రెండేళ్ల గ్యాప్ తీసుకుని చేసిన ఈ సినిమా మెగా అభిమానులను ఎంత మేర ఆకట్టుకుంటుందో ఈ శుక్రవారం తెలియనుంది.