Laya, Meera Jasmine: లయతో పాటు మీరా జాస్మిన్ కూడా సేమ్ ట్రాక్లో ఉందట..!

  • May 19, 2022 / 08:00 PM IST

అప్పట్లో పలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి స్టార్ డం సంపాదించుకున్న హీరోయిన్లలో లయ, మీరా జాస్మిన్ కూడా ఉన్నారు. అయితే లయ కంటే కూడా మీరా జాస్మిన్ కొంచెం ఎక్కువే ఎచీవ్ చేసింది. లయ స్టార్ హీరోలకి జోడీగా నటించే అవకాశాన్ని దక్కించుకోలేకపోయింది. కానీ మీరా జాస్మిన్ మాత్రం పవన్ కళ్యాణ్, రవితేజ, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. తమిళ స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించింది.

కొన్నాళ్ల తర్వాత లయ ఓ ఎన్నారై ను పెళ్ళి చేసుకుని సెటిల్ అయ్యింది.ప్రస్తుతం ఈమె లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయ్యింది. ఇక మీరా జాస్మిన్ దుబాయ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్‌ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు భామలు రీ ఎంట్రీ కోసం తెగ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఓ విధంగా చెప్పాలి అంటే ఇద్దరూ కూడా ఆల్రెడీ రీ ఎంట్రీ ఇచ్చేసినట్టే.

‘అమర్ అక్బర్ ఆంటోని’ లో లయ నటించింది. అది ఎక్కువ నిడివి కలిగిన పాత్ర కాదు. ‘అరవింద సమేత’ లో ఛాన్స్ వచ్చినా ఆమె నొ చెప్పింది. ఇక మీరా జాస్మిన్ మలయాళంలో ఆల్రెడీ కొన్ని సినిమాల్లో నటించింది. కాకపోతే టాలీవుడ్ కు ఇంకా రీ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ ఇద్దరి భామలకు బ్రేక్ ఇచ్చే దర్శకుడు ఎవరు అనే డిస్కషన్లు షురూ అయ్యాయి. సోషల్ మీడియాలో అయితే ఈ ఇద్దరు భామలు చాలా యాక్టివ్ గా ఉంటారు. లయ డ్యాన్స్ వీడియోలతో, మీరా జాస్మిన్ అయితే గ్లామర్ ఫొటోలతో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus