పవన్, త్రివిక్రమ్ సినిమాకి మొదలైన లీకుల సమస్య!

  • November 4, 2017 / 11:13 AM IST

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా థియేటర్లోకి రాకముందే నెట్లో కి వచ్చింది. అప్పటి నుంచి సినీ మేకర్స్ ఈ  లీక్స్  పై చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడు త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ కి గట్టి బందోబస్తు చేపట్టారు. ఎటువంటు లీకేజీ ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా తాజాగా నెట్లో పవన్ ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. హీరోయిన్ అను ఇమ్యానుయేల్ పవన్ తో కలిసి ఉన్న సన్నివేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో చిత్ర యూనిట్ అలర్ట్ అయింది.

ఈ ఫోటోలు ఎలా లీక్ అయిందో .. ఆరా తీసి.. మరో సారి ఇటువంటి చర్యలు జరగకుండా చర్యలు చేపట్టింది. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్యానుయేల్ తో పాటు కీర్తి సురేష్ కూడా  హీరోయిన్ గా నటిస్తోంది. అలనాటి హీరోయిన్ కుష్బూ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కాసేపు కనిపించి నవ్వులు పంచనున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus