LEO, Salaar: సలార్ మూవీ రికార్డ్ ను సులువుగా బ్రేక్ చేసిన లియో.. ఏమైందంటే?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా విడుదలకు ముందే ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నెల 22వ తేదీన సలార్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అయితే యూట్యూబ్ లో సలార్ టీజర్ క్రియేట్ చేసిన రికార్డులు అన్నీఇన్నీ కావు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బుక్ మై షోలో సలార్ మూవీకి 3,67,00 ఇంట్రెస్టెడ్ లైక్స్ రాగా లియో మూవీకి 4,42,000 లైక్స్ వచ్చాయి.

సలార్ మూవీ విడుదలకు చాలా సమయం ఉండటంతో ఆ సమయానికి ఈ రికార్డ్ బ్రేక్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. లియో మూవీ ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. లియో మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో లియో మూవీ రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

లియో తమిళ్ ట్రైలర్ కు ఒక్కరోజులోనే 33 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. లియో సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. లియో తెలుగు వెర్షన్ ట్రైలర్ కు ఏకంగా 5.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. లియో మూవీపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. లియో మూవీలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉంటాయని తెలుస్తోంది.

లియో (LEO) మూవీలో ట్విస్టులు సైతం ఊహించని విధంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. లియో మూవీ విడుదలైన తర్వాత మరిన్ని సంచలనాలను సృష్టించడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లియో మూవీ విడుదలైన తర్వాత అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాల్సి ఉంది. లియో కలెక్షన్ల విషయంలో ఎలాంటి బెంచ్ మార్క్ ను సెట్ చేస్తుందో చూడాలి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus