Lokesh Kanagaraj: గాయాల పాలైన లోకేష్ కనగరాజ్.. ఏమైందంటే..!

తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించే సినిమాలకి తమిళంలోనే కాకుండా అన్ని భాషల్లోనూ ఆదరణ లభిస్తూ ఉంటుంది. ‘విక్రమ్’ తో సత్తా చాటిన లోకేష్.. ఇటీవల వచ్చిన ‘లియో’ తో మరో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళ భాషల్లో కూడా బాగా ఆడుతుంది. ఈ క్రమంలో ప్రెస్ మీట్లు, థియేటర్ విజిట్ లు వంటివి చేసి ‘లియో’ ని ఇంకా బాగా ప్రమోట్ చేయాలని లోకేష్ డిసైడ్ అయ్యాడు.

అందులో భాగంగా.. తాజాగా లోకేష్‌ (Lokesh Kanagaraj) కేరళలో పర్యటించారు. ఈ క్రమంలో అరోమా థియేటర్‌ వద్దకి ఆయన వెళ్లడం జరిగింది. పోలీసులు కూడా భారీగా భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది. అయినా అభిమానులు లోకేష్‌ ను చూసిన ఆనందంలో ఆయన మీదకు దూసుకుని వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు గాయాలవ్వడం జరిగింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. గాయం కారణంగా తిస్సూర్‌ రాగం, కొచ్చి కవిత థియేటర్లకు వెళ్లాల్సిన లోకేష్ తిరిగి చెన్నై వెళ్లిపోయాడు.

దీనిపై ట్విట్టర్లో ఆయన ఓ పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. ఆ పోస్టు ద్వారా లోకేష్ స్పందిస్తూ.. ‘‘నన్ను అభిమానిస్తున్న కేరళ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. పాలక్కడ్‌లో మిమ్మల్ని చూసినందుకు ఎంతో సంతోషంగా.. గర్వంగా అనిపించింది. అక్కడ విపరీతంగా తరలివచ్చిన జనం కారణంగా నాకు చిన్న గాయం అయింది. దాని కారణంగా మరో రెండు చోట్లకు వెళ్లలేకపోయాను. ప్రెస్‌ మీట్‌ కూడా క్యాన్సిల్‌ చేయాల్సి వచ్చింది. నేను మళ్లీ కేరళ వచ్చి మిమ్మల్నందరినీ కలుస్తాను. అంతవరకు అంతే ప్రేమతో ‘లియో’ని ఎంజాయ్ చేయండి’’ అంటూ పేర్కొన్నాడు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus