LEO Tickets: లియో నిర్మాతల అత్యాశ హద్దులు దాటుతోందా.. ఏం జరిగిందంటే?

  • October 16, 2023 / 12:31 PM IST

విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో లియో మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. లియో మూవీ మార్నింగ్ షో టికెట్ రేట్లు తమిళనాడులో 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల రేంజ్ లో ఉన్నాయని తెలుస్తోంది. లియో టికెట్ రేటు తెలిసి నెటిజన్లు, విజయ్ అభిమానులు షాకవుతున్నారు. అత్యాశకు కూడా హద్దుండాలని వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.

లియో (LEO) నిర్మాతల అత్యాశ హద్దులు దాటుతోందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ స్థాయిలో టికెట్ రేట్లు పెట్టి అభిమానులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. లియో మూవీకి లోకేశ్ కనగరాజ్ గత సినిమాలతో సంబంధం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానుల బలహీనతను సొమ్ము చేసుకోవాలని లియో మేకర్స్ ప్రయత్నిస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చెన్నై, కోయంబత్తూరు, మధురై ప్రాంతాలలో ఈ భారీ టికెట్ రేట్లు అమలవుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరలకు టికెట్ రేట్లను విక్రయించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. లియో టికెట్ రేట్ల నెగిటివ్ కామెంట్లపై మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లియో సినిమాకు సీక్వెల్ తెరకెక్కే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ రెమ్యునరేషన్ సినిమాసినిమాకు పెరుగుతుండగా తెలుగులో మార్కెట్ పెంచుకోవాలన్న విజయ్ కోరిక మాత్రం నెరవేరుతోంది. విజయ్ లియో మూవీతో బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తారో చూడాల్సి ఉంది. లియో సినిమా రికార్డులు క్రియేట్ చేయాలని విజయ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమా సినిమాకు విజయ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus