తొడ కొట్టడం.. రికార్డులు బద్దలు కొట్టడం ఆయనకు చాలా చిన్న పని. వెండితెరపై ఆగ్రహం చూపించడం.. రికార్డు స్థాయి వసూళ్లు సాధించడం ఆయనకు ఇంకా చిన్న పని. పాత్ర నచ్చితే దాని కోసం ఎంత కష్టమైన పడేతత్వం ఆయన ఇష్టమైన పని. 50 ఏళ్లకుపైగా అదే చేస్తూ ప్రేక్షకుల మన్నల్ని పొందుతూనే ఉన్నారు. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆ నవ యవ్వనుడు నందమూరి బాలకృష్ణుడు. మరి బాలయ్య బర్త్‌డే రోజున ఆయన ప్రత్యేకతలు చెప్పుకోకపోతే ఎలా?
* సినిమా పరిశ్రమలో 50 ఏళ్లుగా ఉన్నందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బాలయ్య చోటు సంపాదించారు.
* ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా నుండి ఇటీవల లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు.
* బాలయ్య చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.
* బాలయ్య నిజ జీవితంలో డాక్టర్ అవ్వాలని అనుకున్నారు. కానీ టాప్ ర్యాంకు రాక.. నిజాం కాలేజీలో కామర్స్ డిగ్రీ చేశారు.
* 14 ఏళ్ల వయసులోనే నటన రంగంలోకి వచ్చారు. తలి సినిమా ‘తాతమ్మ కల’ (1974).
* తండ్రి ఎన్టీఆర్‌తో మొత్తంగా 19 సినిమాల్లో నటించారు. అందులో 12 సినిమాలకు ఎన్టీఆరే డైరక్టర్.
* ప్రముఖ దర్శకుడు కోదండ రామ రెడ్డి దర్శకత్వంలో 13 సినిమాల్లో నటించారు. అన్నిటికి అన్నీ హిట్ సినిమాలే.
* బాలయ్య తన కెరీర్‌లో ఒక్కసారి మాత్రమే వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది తారకరత్న తొలి సినిమా ‘యువరత్న’.
* రైటర్‌గా ‘ఎన్టీఆర్: కథానాయకుడు’, ‘ఎన్టీఆర్: మహానాయకుడు’ సినిమాలకు పని చేశారు.
* మొత్తంగా 18 సినిమాల్లో ద్విపాత్రాభినం చేశారు. ఏడు సినిమాల్లో సొంత పేరుతో నటించారు. త్రిపాత్రాభినయం చేసిన సినిమా ఒక్కటే. అదే ‘అధినాయకుడు’.
* ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ పాత్రలో నిడివి తక్కువ ఉన్న పాత్రలో కనిపించిన బాలయ్య.. వెంకటేశ్ సినిమా ‘త్రిమూర్తులు’లోని ఓ పాటలో అతిథి పాత్రలో మెరిశారు.