గుంటూరోడు ఆడియో వేడుకలో ఎమోషనల్ గా మాట్లాడిన మంచు మనోజ్
- January 31, 2017 / 07:56 AM ISTByFilmy Focus
డైలాగ్ కింగ్ మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్ తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుంటున్నారు. రొటీన్ కథలను కాకుండా డిఫరెంట్ రోల్స్ తో ముందుకు దూసుకు పోతున్నారు. తనలోని నటనకు వెలికితీస్తున్నారు. ఆయన ఊర మాస్ గా నటించిన “గుంటూరోడు.. లవ్ లో పడ్డాడు” మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి గ్రాండ్ గా జరిగింది. మోహన్ బాబు, శర్వానంద్, సాయిధరమ్ తేజ్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మనోజ్ ఎమోషనల్ గా మాట్లాడి ఆకట్టుకున్నారు. “ఎందుకు మీరు రెగ్యులర్ గా కమర్షియల్ గా సినిమాలు చేయరు? అని నన్ను అభిమానులు చాలామంది అడుగుతుంటారు. వారి అభిమానానికి నా పాదాభివందనాలు. నాకు డబ్బులు సంపాదించాలని ఆశ లేదు. నాకు అన్ని రకాల పాత్రలు పోషించాలని కోరిక ఉంది.
అందుకే వేదం, నేను మీకు తెలుసా, ఊ కొడతారా ఉలిక్కి పెడుతారా వంటి చిత్రాలను చేసాను. అవి నాకు సంతృప్తిని కలిగించాయి. మీ (ఫ్యాన్స్) సంతోషం కోసం కమర్షియల్ మూవీస్ చేస్తాను. కానీ ప్రయోగాలు వదలను.” అని అన్నారు. తొలిసారి పక్క కమర్షియల్ యాంగిల్ తో చేసిన గుంటూరోడు అభిమానులకు చాలా బాగా నచ్చుతుందని వివరించారు. ఇంకా తాను మళ్లీ లావు కావడానికి వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించారు. “అద్భుతమైన కథతో ఒక్కడు మిగిలాడు అనే చిత్రాన్ని చేస్తున్నాను. అందులో మూడు రకాల పాత్రలు పోషించాను. అందులో ఒక క్యారక్టర్ బలంగా ఉండాలి అందుకోసమే మళ్ళీ బరువు పెరిగాను” అని స్పష్టం చేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.











