Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 20, 2026 / 09:32 AM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సుహాస్ (Hero)
  • శివానీ నాగారం (Heroine)
  • సీనియర్ నరేష్, స్రవంతి, వెన్నెల కిషోర్, లావణ్య, హర్షవర్ధన్, బాబు మోహన్ తదితరులు (Cast)
  • గోపి అచ్చార (Director)
  • బి.నరేంద్ర రెడ్డి (Producer)
  • వివేక్ సాగర్ (Music)
  • మహిరెడ్డి పండుగుల (Cinematography)
  • విప్లవ్ నైషధం (Editor)
  • Release Date : ఫిబ్రవరి 20, 2026
  • త్రిశూల్ విజనరీ స్టూడియోస్ (Banner)

సుహాస్ గతంలో చేసిన కొన్ని తప్పులను సరిదిద్దుకుని, తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ “సుహాస్ 2.0”గా ప్రేక్షకులను పలకరించిన తాజా చిత్రం “హే బలవంత్”. గోపి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం “లిటిల్ హార్ట్స్”తో సూపర్ హిట్ కొట్టిన శివానీ హీరోయిన్ గా నటించింది. మరి సినిమా ఎలా ఉంది? ఇంతకీ ఏమిటా బిజినెస్? అనేది చూద్దాం..!!

Hey Balwanth Movie Review

Hey Balwanth Movie Review and Rating

కథ: చిన్నప్పటినుండి తండ్రి చేసే బిజినెస్ అంటే విపరీతమైన ఇష్టంతో, ఎప్పటికైనా తన తండ్రి చేసే బిజినెస్ ని తానే లీడ్ చేయాలి అనుకుంటాడు కృష్ణ (సుహాస్). అందుకోసం హైదరాబాద్ లో ఎంబీయే పూర్తిచేసి మరీ సొంతూరికి తిరిగొస్తాడు. కట్ చేస్తే.. తండ్రి చేసే బిజినెస్ తెలిసి షాక్ అవుతాడు. ఆ బిజినెస్ ను అర్జెంటుగా అమ్మేసి, సరికొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం బెటర్ అనుకుంటాడు.

ఇంతకీ ఆ బిజినెస్ ఏమిటి? ఎందుకని ఇమ్మీడియట్ గా అమ్మేయాలి అనుకుంటాడు? ఆ బిజినెస్ కారణంగా తండ్రీకొడుకుల నడుమ ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి? వాటిని కృష్ణ ఎలా సరిదిద్దాడు? వంటి ప్రశ్నలకి సమాధానమే “హే బలవంత్” చిత్రం.

Hey Balwanth Movie Review and Rating

నటీనటుల పనితీరు: సాధారణంగా సినిమాలో హీరోహీరోయిన్లు హైలైట్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. కానీ.. “హే బలవంత్” సినిమాలో మాత్రం కెమెడియన్ సుదర్శన్ హైలైట్ అయ్యాడు. అతని కామెడీ డైలాగులు, బాడీ లాంగ్వేజ్ హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసాయి. ముఖ్యంగా హీరోయిన్ దగ్గర మొదటిసారి బిజినెస్ మ్యానేజ్ చేసే సీక్వెన్స్ లో సుదర్శన్ & వెన్నెల కిషోర్ టైమింగ్ థియేటర్ మొత్తం నవ్వేలా చేసింది. ఒక నాలుగైదు సీక్వెన్సుల్లో సుదర్శన్ మాత్రం సినిమాని మోసేశాడు అని చెప్పాలి.

సుహాస్ చాలా సినిమాల తర్వాత లుక్స్ వైజ్ కొత్తగా కనిపించాడు. కొద్దిగా ఆండర్ ప్లే చేశాడు కూడా. చుట్టూ ఉన్న పాత్రల డామినేషన్ ని తట్టుకుని నిలబడడంలో మాత్రం తడబడ్డాడు.

శివానీ నాగారం సహజంగా ఉంది. కామెడీ కానీ, ఎమోషన్ కానీ ఎక్కడా అతి చేయకుండా.. సన్నివేశానికి కావాల్సిన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా మాది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అనే సీక్వెన్స్ లో ఆమె నటన బాగుంది.

హర్షవర్ధన్, అజయ్ ఘోష్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు తమ నటనతో పాత్రల బరువు మోసారు. పాపులర్ యాంకర్ స్రవంతి చొక్కారపు స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించింది. డైలాగ్ డెలివరీ విషయంలో మాత్రం ఇంప్రూవ్మెంట్ అవసరం.

Hey Balwanth Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: వివేక్ సాగర్ మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ర్యాప్ సాంగ్ ఆ ట్విస్ట్ ని బాగా ఎలివేట్ చేసింది. మిగతా పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతంతో కామెడీ, ఎమోషన్ ను బాగా ఎలివేట్ చేశాడు వివేక్.

మహిరెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. లిమిటెడ్ లొకేషన్స్ లో రిపిటేషన్ లేకుండా షూట్ చేశాడు. ఆర్ట్ & ప్రొడక్షన్ టీమ్స్ వర్క్ బాగుంది. ముఖ్యంగా బిజినెస్ సెటప్ ను చాలా ఆర్గానిక్ గా చూపించారు.

దర్శకుడు గోపి అచ్చార ఎంచుకున్న పాయింట్ ప్రస్తుత తరానికి కొత్తదే. తండ్రి చేస్తున్న పని ఏమిటి అనేది తెలియకుండా పెరిగిన కొడుకు, అనంతరం ఆ పనేంటో తెలుసుకొని అసహ్యం పెంచుకుని, చివరికి అసలు వెల్యూ తెలుసుకుంటాడు. ఇది యాక్చువల్ థీమ్. ఇందులో కామెడీ & ఎమోషన్ ను మిళితం చేసే ప్రయత్నం కొంతమేరకు సఫలీకృతమైంది. అయితే.. అంత ఆసక్తి రేకెత్తించిన బిజినెస్ ఏమిటి అనేది మొదటి రెండు నిమిషాల్లోనే రివీల్ చేయడం అనేది ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ప్రేక్షకుడు ఎందుకొచ్చాడో, అది సీట్లో సర్దుకుని కూర్చునేలోపు రివీల్ చేసేయడం అనేది చిన్నపాటి మైనస్. కనీసం ప్రీఇంటర్వెల్ దాకా అయినా హోల్డ్ చేయాల్సింది. అయితే.. కామెడీ సీక్వెన్సులు మాత్రం బాగా రాసుకున్నాడు. సుదర్శన్ సీన్స్ అన్నీ బాగా పేలాయి.

అలాగే.. నరేష్ తో చేయించిన “ప్యారడైజ్, లెజెండ్, సమరసింహా రెడ్డి” సినిమాల డైలాగ్ స్పూఫ్ కూడా వర్కవుట్ అయ్యింది. అయితే.. ఎమోషన్ & డ్రామా మాత్రం వర్కవుట్ అవ్వలేదు. ఈ సినిమా ఎండింగ్ కి కావాల్సిందే డ్రామా సరిగా వర్కవుట్ అవ్వడం. ముఖ్యంగా సుహాస్-నరేష్ నడుమ డ్రామా అనేది సరిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు, దానికంటూ ఒక ఎమోషనల్ వెల్యూ కూడా లేదు. దాన్ని ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బెటర్ వెల్యూ యాడ్ అయ్యేది. అయినప్పటికీ.. దర్శకుడిగా తొలి చిత్రంతోనే ఇంతమంది ఆర్టిస్టులను, ఒక సెన్సిబిల్ టాపిక్ ని ఎక్కడా అసభ్యతకి తావు లేకుండా చూపించడంలో సఫలీకృతుడయ్యాడు. ముఖ్యంగా లేటెస్ట్ మీమ్స్ అన్నీ సినిమాలో ఇరికించిన విధానం ఎబ్బెట్టుగా లేకపోవడం, వాటికి జనాలు రిలేట్ అవ్వడం మరో ప్లస్ పాయింట్. ఓవరాల్ గా దర్శకుడిగా మొదటి సినిమాతో ఫర్వాలేదనిపించుకున్నాడు గోపి అచ్చార.

Hey Balwanth Movie Review and Rating

విశ్లేషణ: ఒక సెన్సిటివ్ టాపిక్, అది కూడా సమాజం అదేదో బూతులా చూసే టాపిక్ ని టచ్ చేసి హ్యూమర్ జనరేట్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. అయితే.. గోపి అచ్చార ఆ విషయంలో కొంతమేరకు మెప్పించగలిగాడు. డ్రామా గనుక ఇంకాస్త బాగా రాసుకొని, వర్కవుట్ చేయించి ఉంటే మాత్రం బాగుండేది. తండ్రీకొడుకుల మధ్య తెలియని ఓ పొర ఏర్పడి, కమ్యూనికేషన్ తగ్గడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. ఆ పాయింట్ ను పైపైన టచ్ చేశాడు కానీ, ఇంకాస్త లోతుగా ఎస్టాబ్లిష్ చేసి, ఎమోషన్ ను బాగా పండించే స్కోప్ ఉంది.

అలాగే.. హ్యూమర్ అనేది సుదర్శన్, నరేష్ లు క్యారీ చేశారు. అప్పట్లో ఈవీవీ ఈ తరహా కాన్సెప్టులతో ఆడియన్స్ ను అలరించేవారు. ఇప్పుడు గోపి ఆ ఫార్మాట్ లో మంచి తెగువ చూపించాడు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే భవిష్యత్తులో మంచి దర్శకుడిగా ఎదగగలడు. మొత్తానికి.. “హే బలవంత్” అనేది హెవీ ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా చూస్తే ఫర్వాలేదు అనిపిస్తూ.. ఓ మోస్తరుగా ఎంటర్టైన్ చేసి, ఎంగేజ్ చేస్తుంది.

Hey Balwanth Movie Review and Rating

ఫోకస్ పాయింట్: అక్కడక్కడా బలవంతపెట్టిన.. ఓవరాల్ గా బాగుంది!

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hey Balwanth Movie
  • #Naresh VK
  • #shivani
  • #Sudharshan
  • #Suhas

Reviews

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

8 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

10 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

11 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

11 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

11 hours ago

latest news

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

12 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

12 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

13 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

14 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version