సినిమాను పొగుడుకుంటూ ప్రమోషన్ చేయడం ఒక రకం, తమ సినిమానే తామే తక్కువ చేసుకుని చెప్పడం మరో రకం ప్రమోషన్. తొలి రకం ప్రమోషన్ చేసినప్పుడు వచ్చే రెస్పాన్స్ కంటే.. రెండో రకం ప్రమోషన్‌కు రెస్పాన్స్ వస్తుంది. దీని గురంచి ఇంకా బాగా చెప్పాలంటే సంతోష్ శోభన్కే సాధ్యం. ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’. ఈ సినిమా కోసం టీమ్ డిఫరెంట్‌గా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా డిస్ట్రిబ్యూటర్ల పంచాయితీ పేరుతో ఓ వీడియో చేశారు.
సంతోష్ శోభన్ ఆయన హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ చిత్రంలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించింది. సుదర్శన్, బ్రహ్మాజీ, నరేన్, సప్తగిరి, ‘మిర్చి’ కిరణ్ తదితరులు ఇతర కీలక పాత్రధారులు. ఈ సినిమాను నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సంతోష్, సుదర్శన్ ఫన్నీగా చేసిన ‘డిస్ట్రిబ్యూటర్ల పంచాయితీ’ అనే వీడియోను బుధవారం విడుదల చేశారు.
మూడు నిమిషాల నిడివి ఉన్న ‘డిస్ట్రిబ్యూటర్ల పంచాయితీ’ అనే వీడియో ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. సినిమాకు డిస్ట్రిబ్యూషన్ విషయంలో సంతోష్ శోభన్ ఆలోచిస్తుంటే.. సుదర్శన్ అక్కడికి వస్తారు. అప్పుడు ‘‘మనకు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉన్నారా?’’ అని సంతోష్ అడిగితే… ఎంతమంది ఉన్నారో చూడు అంటూ సుదర్శన్.. సంతోష్ శోభన్‌ను బయటకు తీసుకెళ్లి చూపిస్తాడు. అక్కడ కొంతమంది జనాలు సంతోష్ కోసం వెయిట చేస్తుంటారు.
దాంతో ఆశ్చర్యపోయిన సంతోష్ శోభన్ అమెను లోపలకు పిలిపిస్తాడు. నలుగురు డిస్ట్రిబ్యూటర్లు వచ్చి.. సినిమా గురించి, సంతోష్ గురించి మాట్లాడతారు. అలా కాసేపు చర్చలు పూర్తయ్యాక.. వచ్చిన వారు యూట్యూబర్లు అని తెలియడంతో సంతోష్ అవాక్కవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేద వీడియోలో చూడొచ్చు. ప్రచార శైలి, పోస్టర్లు, అప్రోచ్ అయితే చాలా బాగుంది. మరి సినిమా ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. సినిమా చూశాక ఎంతమంది లైక్, షేర్ చేస్తారో చూద్దాం.