కోలీవుడ్‌లో నిర్మాతలు – దర్శకుల మధ్య ఏం జరుగుతోంది. వరుసగా రెండో దర్శకుడిపై నిర్మాత కేసు వేసిన ఘటన మరొకటి జరిగింది. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ మీద లైకా ప్రోడక్షన్స్ వాళ్లు కేసు వేసిన ఘటన మరవక ముందే, దర్శకుడు లింగు స్వామి మీద నిర్మాత జ్ఞాన్వేల్ రాజా కేసు వేశారు. దీంతో ఇప్పుడు కోలీవుడ్ ఈ విషయమ్మీదే చర్చలు నడుస్తున్నాయి. అంతేకాదు తెలుగులో లింగుస్వామి చేద్దామంటున్న సినిమాకే ఎర్త్ కొట్టేలా ఉంది.
సూర్య, లింగుస్వామి కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని చాలా రోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే ఏమైందో కానీ… ఆ తర్వాత ఆ సినిమా ముచ్చటే లేకుండా పోయింది. ఈలోగా లింగుస్వామి… ఫ్లాప్‌ల బాట పట్టారు. ఇక లింగుస్వామి సినిమాలు తగ్గిపోతున్నాయనుకున్న సమయంలో తెలుగులో రామ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత అవి నిజమైపోయి, ఇటీవల కథ ఓకే అయ్యిందని రామ్ కూడా ప్రకటించాడు. అంతా ఓకే అనుకుంటున్న తరుణంలో తమిళనాడులో మరో కథ మొదలైంది. లింగుస్వామిపై ప్రముఖ నిర్మాత జ్ఞాన్వేల్ రాజా… తెలుగు నిర్మాతల మండలికి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు.
స్టూడియో గ్రీన్ బ్యానర్లో ఓ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తానని మాటిచ్చి, లింగుస్వామి అడ్వాన్స్ తీసుకున్నారని, ఇప్పుడు ఆ సినిమా చేయకుండా వేరే సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నారనేది ఫిర్యాదు సారాంశం. లింగుస్వామి ముందు మా బ్యానర్లో సినిమా చేయాలి. ఆ తర్వాతే కొత్త ప్రాజెక్టులోకి వెళ్లాలి అని జ్ఞాన్వేల్ రాజా కోరారు. అయితే లింగుస్వామి… రామ్‌తో సినిమా చేయడంపై తమకెలాంటి సమస్య లేదని జ్ఞాన్వేల్ చెప్పారు. దీంతో రామ్ సినిమా విషయంలో మళ్లీ సందిగ్ధత మొదలైంది. ఆ మధ్య సినిమా ఉంటుందా లేదా అనే పుకార్లు వచ్చాయి. వాటికి ట్వీట్‌తో రామ్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు లింగుస్వామి కోర్టులో బంతి ఉంది… ఏం చేస్తాడో చూడాలి.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!