ఈ హీరోయిన్లు పంతులమ్మలుగా కూడా నటించి ఆకట్టుకున్నారు..!

  • September 5, 2020 / 03:47 PM IST

మనిషి జీవితంలో తల్లిదండ్రుల తరువాత.. అత్యంత కీలక పాత్ర పోషించేది గురువే అనడంలో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు నేర్పించే భయభక్తులు, క్రమశిక్షణ వల్లే ఏ మనిషైనా సరైన మార్గంలో నడుస్తాడు. ఉన్నత స్థానాన్ని సంపాదించుకుంటాడు. వినడానికి చాలా ఓల్డ్ గా అనిపించినా.. ఇదే నిజం. అందుకే మాతృదేవోభవా..!, పితృదేవోభవా..! ఆచార్య దేవోభవా..! అంటుంటారు మన పెద్దలు..! ఈరోజు టీచర్స్ డే కాబట్టి ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. సినిమాల్లో టీచర్ పాత్రలు పోషించడానికి హీరోలు, కమెడియన్లు ముందుకు వచ్చినంత ఈజీగా హీరోయిన్లు ముందుకు రారు.. అసలు ఆ పాత్రలకు ఇంట్రెస్ట్ చూపించరు అనే టాక్ ఎప్పటినుండో ఉంది. బహుశా టీచర్ గా చెయ్యడం అంటే.. ఏజ్ పెంచే పాత్రని వారు ఫీలవుతుంటారేమో..! అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం టీచర్ పాత్రలు పోషించి అలాంటి అపనమ్మకాలకు చెక్ పెట్టారు. ఆ హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) విజయశాంతి : ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ వంటి చిత్రాల్లో టీచర్ పాత్ర పోషించింది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి.

2) అసిన్ : వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘ఘర్షణ’ చిత్రంలో టీచర్ గా కనిపించింది అసిన్.

3) ఇలియానా :రవితేజ… ‘ఖతర్నాక్’ సినిమాలో టీచర్ గా కనిపించింది ఇలియానా.

4) కమలినీ ముఖర్జీ : ‘హ్యాపీ డేస్’ చిత్రంలో ఇంగ్లీష్ లెక్చరర్ గా కనిపించింది కమలినీ ముఖర్జీ.

5) నయనతార : ఆర్య హీరోగా నటించిన ‘నేనే అంబానీ’ చిత్రంలో టీచర్ గా కనిపించింది నయనతార.

6) నందిత శ్వేత : ‘అక్షర’ సినిమాలో ప్రొఫెసర్ గా కనిపించింది నందిత శ్వేత.

7) రాయ్ లక్ష్మీ : ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’ చిత్రంలో టీచర్ గా కనిపించింది రాయ్ లక్ష్మీ.

8) అనుపమ పరమేశ్వరన్ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్షసుడు’ చిత్రంలో టీచర్ గా కనిపించింది అనుపమ.

9) ‘కలర్స్’ స్వాతి : ‘గోల్కొండ హైస్కూల్’ చిత్రంలో టీచర్ గా నటించింది స్వాతి.

10) రమ్యకృష్ణ : ‘కౌరవుడు’ చిత్రంలో టీచర్ గా కనిపించింది రమ్యకృష్ణ.

11) సుహాసిని : చిరంజీవి హీరోగా నటించిన ‘ఆరాధన’ చిత్రంలో టీచర్ గా కనిపించింది సుహాసిని.

12) లక్ష్మీ : సీనియర్ హీరోయిన్ లక్ష్మీ కూడా ‘పంతులమ్మ’ సినిమాలో టీచర్ గా కనిపించింది.

13) జమున : ‘మట్టిలో మాణిక్యం’ చిత్రంలో టీచర్ గా కనిపించింది జమున.

14) సావిత్రి : ‘మిస్సమ్మ’ చిత్రంలో టీచర్ గా కనిపించింది మహానటి సావిత్రి.

15) రాశీ : ‘ప్రేయసి రావే’ చిత్రంలో టీచర్ గా కనిపించింది రాశీ.

16) శృతి హాసన్ : ‘ప్రేమమ్’ సినిమాలో లెక్చరర్ పాత్రలో కనిపించింది శృతి హాసన్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus