వాల్తేరు వీరయ్య తో పాటు చిరు – రవితేజ ఎన్ని సినిమాల్లో కనిపించారో.. తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్ లలో భాగంగా విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమాలో రవితేజ కూడా నటించడంతో భారీ క్రేజ్ నెలకొంది.

విక్రమ్ సాగర్ అనే పోలీస్ పాత్రలో నటించడంతో చిరు – రవితేజ ల మధ్య వచ్చే సన్నివేశాలు గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయని స్పష్టమవుతుంది. ట్రైలర్ లో చిరు హిట్ సినిమాల్లోని డైలాగ్ రవితేజ… అలాగే రవితేజ హిట్ సినిమాల్లోని డైలాగ్ చిరు చెబుతుంటే.. వీరి అభిమానులకు మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. చిరు – రవితేజ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపించడం ఇది మొదటి సారి కాదు.

గతంలో అన్నయ్య సినిమాలో చిరంజీవి …. తమ్ముడిగా రవితేజ కనిపించారు. అలాగే శంకర్ దాదా జిందాబాద్ లో కూడా చిరు తో కలిసి రవితేజ స్టెప్ వేశాడు. అంతేకాదు ఇంకాస్త ముందుకు వెళ్తే.. రవితేజ … చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా కనిపించాడు. అందుకు సంబంధించిన మీమ్ ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. సినీ పరిశ్రమలో రవితేజ యొక్క గ్రోత్ ను సూచిస్తూ ఈ మీమ్ ఉంది అని చెప్పొచ్చు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus