ఇప్పటివరకు క్రికెటర్స్ నటించిన సినిమాలు ఏంటంటే..?

  • November 11, 2022 / 08:00 AM IST

ఇప్పటివరకు సినీ స్టార్ట్స్ (హీరోయిన్స్) క్రికెటర్స్‌తో లవ్‌లో పడడం చూశాం కానీ కొద్దికాలంగా క్రికెటర్స్ బ్యాట్ వదిలేసి మేకప్ వేసుకోవడం మొదలెట్టారు.. సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, ధోని, అజారుద్దీన్, మిథాలీ రాజ్ వంటి క్రికెటర్స్ బయోపిక్స్ తెరకెక్కి ప్రేక్షకాదరణ పొందాయి.. శ్రీశాంత్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి ఇండియన్ క్రికెటర్స్ కొందరు సౌత్ స్క్రీన్ మీద మెరిశారు.. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..

8 మంది క్రికెటర్లు ఒకే సినిమాలో..

హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, శ్రీనాథ్, ఆశిష్ నెహ్రా, కపిల్ దేవ్, పార్థివ్ పటేల్, మహ్మద్ కైఫ్, నవ్‌జోత్ సింగ్ సిద్ధు లాంటి ఇండియన్ క్రికెటర్స్ అంతా కలిసి.. వాళ్ల రియల్ క్యారెక్టర్లతోనే సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేశారు. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా మెయిన్ లీడ్స్‌గా డేవిడ్ ధావన్ డైరెక్ట్ చేసిన ‘ముఝ్సే షాదీ కరోగి’ లో వీళ్లు కనిపించారు.. 2004లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ని ఆకట్టుకుంది..

యోగ్ రాజ్ సింగ్ (యువరాజ్ ఫాదర్)..

యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్.. కమల్ హాసన్, శంకర్‌ల కాంబోలో వస్తున్న ‘ఇండియన్ 2’ లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ మేకప్ వేసుకుంటున్న పిక్ షేర్ చేశారాయన.. యోగ్ రాజ్ సింగ్ పలు పంజాబీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఈ రేంజ్ పాన్ ఇండియా ఫిల్మ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్.. యోగ్ రాజ్ సింగ్ యాక్టర్ అనే విషయం నెటిజన్లకి పెద్దగా తెలియదు కానీ 2011 వరల్డ్ కప్ తర్వాత తన కొడుకు యువరాజ్ సింగ్ కెరీర్ డౌన్ ఫాల్ అవడానికి ధోని కారణమంటూ కామెంట్స్ చేసి వార్తల్లో కనిపించారు. ఇండియన్ సినిమాలో నటిస్తున్నానంటూ తనను తాను పంజాబ్ సింహంగా అభివర్ణించుకున్నారు యోగ్ రాజ్..

హర్భజన్ సింగ్..

‘ముఝ్సే షాదీ కరోగి’ తర్వాత ‘భాజీ ఇన్ ప్రాబ్లమ్’ అనే పంజాబీ, ‘సెకండ్ హ్యాండ్ హస్బెండ్’ (హిందీ), ‘డిక్కీలోనా’ అనే తమిళ్ మూవీస్‌లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు. ఫస్ట్ టైం మెయిన్ లీడ్‌గా ‘ఫ్రెండ్ షిప్’ అనే తమిళ్ ఫిలిం చేశాడు. యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో కనిపించారు. నటుడిగా బజ్జీకి ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది..

శ్రీశాంత్..

హిందీ, మలయాళం టీవీ షోలలో కనిపించిన శ్రీశ్రాంత్.. ‘అక్సర్’, ‘క్యాబరెట్’ (హిందీ), ‘టీమ్ 5’ (మలయాళం), ‘కెంపెగౌడ 2’ (కన్నడ – విలన్), విజయ్ సేతుపతి, నయనతార, సమంతల ‘కాతువాకుల రెండు కాదల్’ (తమిళ్) సినిమాల్లో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నాడు..

ఇర్ఫాన్ పఠాన్..

‘ముఝ్సే షాదీ కరోగి’ తర్వాత ఇర్ఫాన్ పఠాన్, చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ మూవీతో ఫుల్ టైమ్ యాక్టర్‌గా మారాడు.. ఇందులో స్టైలిష్ అండ్ కన్నింగ్ విలన్‌ క్యారెక్టర్ చేశాడు.. నటుడిగా బిజీ అయిపోతాడు అనేంతగా తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు ఇర్ఫాన్..

ఎమ్.ఎస్.ధోనీ..

ధోని ఇటీవలే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడు. భార్య సాక్షితో కలిసి సినీ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ అనే బ్యానర్ స్థాపించి తమిళ్‌లో సినిమా చెయ్యబోతున్నారు..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus