స్టార్ డైరెక్టర్లు (Directors) మాత్రమే రూ.100 కోట్ల సినిమాలు ఇవ్వగలరు అనేది నిన్నటి మాట. తెలుగు సినిమా స్పాన్ పెరిగిన ఈ రోజుల్లో.. సరైన కంటెంట్ డెలివరీ చేస్తే చాలు చిన్న, మీడియం రేంజ్ దర్శకులు కూడా వంద కోట్ల క్లబ్ లో చేరి టాప్ డైరెక్టర్స్ (Directors) లిస్ట్ లో చేరిపోతున్నారు. అలాంటి వారి లిస్ట్ ను ఒకసారి గమనిస్తే :
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)- రష్మిక (Rashmika Mandanna)..లతో చేసిన ‘గీత గోవిందం’ (Geetha Govindam) సినిమాతో తొలిసారి వంద కోట్ల క్లబ్లో చేరాడు దర్శకుడు పరశురామ్ పెట్ల(బుజ్జి). ఆ సినిమా ఫుల్ రన్లో రూ.130 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టి ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అటు తర్వాత మహేష్ బాబుతో (Mahesh Babu) ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) అనే సినిమా కూడా చేశాడు పరశురామ్. ఆ సినిమా యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ వద్ద రూ.180 కోట్ల వరకు కొల్లగొట్టింది. ఇలా పరశురామ్ ఖాతాలో 2 రూ.100 కోట్ల సినిమాలు ఉన్నాయి.
2) బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) :
‘ఉప్పెన’ (Uppena) చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్ (Sukumar) శిష్యుడు బుచ్చిబాబు. తొలి సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇప్పుడు చరణ్ తో (Ram Charan) చేస్తున్న సినిమా రూ.300 కోట్లు పైనే కలెక్ట్ చేస్తుంది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
3) త్రినాథరావ్ నక్కిన (Trinadha Rao) :
రవితేజతో (Ravi Teja) చేసిన ‘ధమాకా’ (Dhamaka) సినిమాతో రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు దర్శకుడు త్రినాథరావు నక్కిన. ఈ సినిమాతో అతని మార్కెట్ కూడా పెరిగింది. కానీ తర్వాత చేసిన ‘మజాకా’ (Mazaka) డిజప్పాయింట్ చేసింది.
4) చందూ మొండేటి (Chandoo Mondeti) :
‘కార్తికేయ 2’ (Karthikeya 2) సినిమాతో తొలిసారి వంద కోట్ల క్లబ్ లో చేరాడు చందూ. ఆ సినిమా ఫుల్ రన్లో రూ.120 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక ఈ ఏడాది వచ్చిన ‘తండేల్’ (Thandel) తో మరో రూ.100 కోట్ల సినిమా అందుకున్నాడు. ఇతను కూడా ఇప్పుడు టాప్ ఆర్డర్ లో ఉన్నాడు.
5) వెంకీ అట్లూరి (Venky Atluri) :
ధనుష్ తో (Dhanush) చేసిన ‘సార్'(తమిళంలో ‘వాతి’) తో (Sir) తొలిసారి రూ.100 కోట్ల క్లబ్ లో చేరాడు దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri). ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ తో (Dulquer Salmaan) చేసిన ‘లక్కీ భాస్కర్’ తో (Lucky Baskhar) మరో రూ.100 కోట్ల సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు.
6)శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) :
నాని (Nani) హీరోగా వచ్చిన ‘దసరా’ తో (Dasara) దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. పీరియాడిక్ అండ్ రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా.. సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల పైనే వసూళ్లు సాధించింది.
7) వివేక్ ఆత్రేయ (Vivek Athreya) :
‘మెంటల్ మదిలో’ (Mental Madhilo) ‘బ్రోచేవారెవరురా’ (Brochevarevarura) ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) వంటి సినిమాలతో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ.. ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) అనే న్యూ ఏజ్ యాక్షన్ డ్రామాని తీశాడు. నాని హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు కొల్లగొట్టింది.
8) శైలేష్ కొలను (Sailesh Kolanu) :
‘హిట్’ (HIT)(హిట్ ది ఫస్ట్ కేస్) , ‘హిట్ 2’ (HIT 2)(హిట్ ది సెకండ్ కేస్) వంటి సినిమాలతో పాపులర్ అయిన శైలేష్ కొలను తర్వాత వెంకటేష్ తో (Venkatesh) ‘సైందవ్’ (Saindhav) అనే సినిమా చేశాడు. ఇది ఫ్లాప్ అయ్యింది. దీంతో శైలేష్ పని అయిపోయింది అంతా అనుకుంటున్న టైంలో ‘హిట్ 3’ తో (HIT 3) హిట్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు పైనే కలెక్ట్ చేసింది. శైలేష్ ను వంద కోట్ల దర్శకుడిగా నిలబెట్టింది.
9) మల్లిక్ రామ్ (Mallik Ram) :
‘డిజె టిల్లు’ కి (DJ Tillu) సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) వచ్చింది. దీనికి మల్లిక్ రామ్ దర్శకుడు. సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా నటించి కథ కూడా అందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.125 కోట్ల వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. అలా మల్లిక్ రామ్ కూడా వంద కోట్ల దర్శకుడు అయిపోయాడు.
10) ప్రశాంత్ వర్మ (Prasanth Varma) :
‘అ!’ (Awe) ‘జాంబీ రెడ్డి’ (Zombie Reddy) వంటి సినిమాలతో హిట్లు అందుకుని పాపులర్ అయిన ప్రశాంత్ వర్మ… ‘హనుమాన్’ (Hanu Man) అనే ఫాంటసీ మూవీని డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా ప్రశాంత్ వర్మని వంద కోట్ల క్లబ్ లో చేర్చడమే కాకుండా ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ గా రూ.340 కోట్ల పైనే కలెక్ట్ చేసింది.