Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » ఆగస్టులో ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయంటే?

ఆగస్టులో ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయంటే?

  • August 1, 2022 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆగస్టులో ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయంటే?

వర్షాకాలం వినోదాల కోసం టాలీవుడ్‌ సిద్ధమైంది. టాలీవుడ్‌ అన్‌సీజన్‌గా భావించే ఆగస్టులో పెద్ద ఎత్తున సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సీనియర్‌ స్టార్‌ హీరోలు అయితే రావడం లేదు కానీ, కుర్ర స్టార్‌ హీరోలు, కొత్త కుర్రాళ్లు తమ సినిమాలతో సిద్ధమైపోయారు. అలా ఈ నెలలో 14కిపైగా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలు మీ కోసం…

* ఆగస్టు నెల ‘సీతారామం’ ప్రేమ కథతో మొదలుకాబోతోంది. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. వైజయంతీ మూవీస్‌ పతాకంపై హను రాఘవపూడి తెరకెక్కించారు. ఈ సినిమాను ఆగస్టు 5ప విడుదల చేస్తున్నారు.

* కల్యాణ్‌ రామ్‌ ప్రతిష్ఠాత్మకంగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘బింబిసార’. కెరీర్‌లో హయ్యెస్ట్‌ అంచనాలతో సినిమా ఆగస్టు 5న రాబోతోంది. వశిష్ఠ్‌ మల్లిడి తెరకెక్కించిన ఈ చిత్రంలో కల్యాణ్‌ రామ్‌ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇందులో కేథరిన్‌, సంయుక్త మీనన్‌ కథానాయికలు.

* ఆమిర్‌ ఖాన్‌ 14 ఏళ్ల కల ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ కూడా ఈ నెలలోనే రాబోతోంది. ఈ సినిమాను తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్న విషయం తెలిసిందే. 11న విడుదల కానున్న ఈ సినిమాలో కరీనా కపూర్‌ కథానాయిక కాగా, నాగచైతన్య ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ‘ఫారెస్ట్‌ గంప్‌’ సినిమాకు ఇది రీమేక్‌.

* ‘కార్తికేయ’తో మంచి విజయం అందుకున్న నిఖిల్‌ ‘కార్తికేయ 2’ సినిమా చేసిన విషయం తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా చాలా సార్లు వాయిదాపడి ఆఖరికి ఈ నెల 12న థియేటర్లకు రాబోతోంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక.

* ప్రేమకథలు, కుటుంబ కథలతో ట్రాక్‌లోకి వచ్చిన నితిన్‌ మళ్లీ మాస్‌ బాట పట్టిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి, కేథరిన్‌ నాయికలు. అంజలి ప్రత్యేక గీతంలో నర్తించింది. ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేస్తున్నారు.

* బెల్లంకొండ కుటుంబం నుండి వస్తున్న రెండో హీరో గణేష్‌. లక్ష్మణ్‌ కృష్ణ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ కథానాయిక. ఈ సినిమాను ఆగస్టు 13న తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.

* ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటించిన చిత్రం ‘తీస్‌ మార్‌ ఖాన్‌’. కల్యాణ్‌జీ గోగన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను 19న విడుదల చేస్తున్నారు. ప్రచార చిత్రాలతో ఈ సినిమా కాస్త హైప్‌ తెచ్చుకుంది.

* ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు సమర్పణలో యువ కమెడియన్లు, టీవీ ఆర్టిస్ట్‌లతో తెరకెక్కిన చిత్రం ‘వాంటెట్‌ పండుగాడ్‌’. సుధీర్‌, దీపిక పిల్లి, సునీల్‌, సప్తగిరి, అనసూయ, విష్ణు ప్రియ.. ఇలా టీవీ తారలు ఇందులో నటించారు. ఈ సినిమా 19న విడుదలవుతోంది.

* పూరి జగన్నాథ్‌ – విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘లైగర్‌’. ఈ సాలా క్రాస్‌ బ్రీడ్‌ ఈ నెల 25న వస్తున్న విషయం తెలిసిందే. అనన్య పాండే కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు. సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

* ఇవి కాకుండా ‘విరుమాన్‌’, ‘మాటరాని మౌనమిది’, ‘కమిట్‌మెంట్‌’, ‘కాలాపురం’, ‘పిశాచి 2’ లాంటి చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఎన్ని థియేటర్లకు వస్తాయో చూడాలి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Karthikeya 2
  • #Laal Singh Chaddha
  • #Liger
  • #Macherla Niyojakavargam

Also Read

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

4 hours ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

4 hours ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

8 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

9 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 hours ago

latest news

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

6 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

7 hours ago
Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

7 hours ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

8 hours ago
Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version