శృతి హాసన్.. కమల్ హాసన్ కూతురు గా కెరీర్ ను ప్రారంభించింది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో కూడా ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈమె పాటలు పాడగలదు, అద్భుతంగా డాన్స్ లు చేయగలదు,సంగీత దర్శకురాలిగా మంచి మ్యూజిక్ కంపోజ్ చేయగలదు, సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకోగలదు.కమల్ హాసన్ కూతురు అనే ట్యాగ్ ను.. ఈమె ఎంట్రీ వరకే వాడుకుంది. స్టార్ ట్యాగ్ ను ఈమె సొంత టాలెంట్ తోనే సంపాదించుకుంది.అలా అని ఈమె ఇండస్ట్రీలో అడుగుపెట్టగానే సక్సెస్ దక్కలేదు.
కెరీర్ ప్రారంభంలో ఈమె నటించిన ‘లక్’ ‘దిల్ తో బచ్చా హై జి’ ‘అనగనగా ఓ ధీరుడు’ ‘3’ వంటి ఈమె నటించిన సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయి. ‘ఓ మై ఫ్రెండ్’ ‘సెవెంత్ సెన్స్’ వంటి సినిమాలు యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్నాయి. ఈ సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా ఆమె క్రేజ్ పెరుగుతూనే వచ్చింది. ఈమెకు సరైన పాత్ర పడటం లేట్ అయ్యింది అని హరీష్ శంకర్ ప్రూవ్ చేశాడు.
అటు తర్వాత నుండి ఈమె సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయిపోయింది. ప్లాపులతో సతమతమవుతున్న హీరోల సినిమాల్లో ఈమె నటించగా అవి సక్సెస్ అందుకున్నాయి. అలా లక్కీ హీరోయిన్ అయిపోయింది శృతి హాసన్.ఆమె నటించిన సినిమాల వల్ల ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు ఎవరు? ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) గబ్బర్ సింగ్ :
పవన్ కళ్యాణ్ వరుస ప్లాపుల్లో ఉన్న టైంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది. ఆమెకు కూడా ఇది మొదటి బ్లాక్ బస్టర్ మూవీ. అలాగే ఈ మూవీతో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.
2) రవితేజ :
‘బలుపు’ కి ముందు రవితేజ నటించిన ‘సారొచ్చారు’ ‘దేవుడు చేసిన మనుషులు’ ‘దరువు’ ‘నిప్పు’ ‘వీర’ ఇలా అన్నీ ప్లాపులే. అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన ‘బలుపు’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇందులో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.
3) రాంచరణ్ :
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాంచరణ్ నటించిన ఎవడు మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీకి ముందు రాంచరణ్ నటించిన ‘తుఫాన్’ చిత్రం ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. ‘ఎవడు’ తో అతను మళ్ళీ హిట్ అందుకున్నాడు. ఇందులో కూడా శృతి హాసన్ హీరోయిన్ కావడం విశేషం.
4) అల్లు అర్జున్ :
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రేసుగుర్రం’ చిత్రానికి ముందు అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రం ప్లాప్ అయ్యింది. అయితే ‘రేసు గుర్రం’ తో అతను మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇందులో కూడా శృతి హాసన్ హీరోయిన్.
5) విశాల్ :
‘పూజ’ చిత్రానికి ముందు విశాల్ కు తెలుగులో ఒక్క హిట్టు కూడా లేదు. తమిళ్ లో కూడా అతను నటించిన సినిమాలు యావరేజ్ గానే ఆడాయి. అయితే హరి దర్శకత్వంలో వచ్చిన ‘పూజ’ చిత్రంతో అతను కోలుకున్నాడు.ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.
6) మహేష్ బాబు :
‘శ్రీమంతుడు’ చిత్రానికి ముందు మహేష్ కు ‘1 నేనొక్కడినే’ ‘ఆగడు’ వంటి డిజాస్టర్లు పడ్డాయి. దీంతో కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ తో అతను కోలుకున్నాడు. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.
7) వేదాలం :
ఈ చిత్రానికి ముందు అజిత్ నటించిన ‘ఎంతవాడు గాని'(ఎన్నై అరిందాల్) కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది. అయితే శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేదాలం’ తో హిట్ అందుకున్నాడు అజిత్. ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించిన సంగతి తెలిసిందే.
8) నాగ చైతన్య :
‘ఆటో నగర్ సూర్య’ ‘దోచేయ్’ వంటి ప్లాప్ లను ఫేస్ చేస్తున్న టైంలో ‘ప్రేమమ్’ రూపంలో నాగ చైతన్యకి ఓ హిట్ పడింది. చందూ మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కూడా శృతి హాసన్ ఓ హీరోయిన్ గా నటించింది.
9) రవితేజ :
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్రాక్’ కు ముందు రవితేజ నటించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ‘క్రాక్’ చిత్రం రవితేజకి మంచి బ్లాక్ బస్టర్ ను అందించింది. ఈ చిత్రంలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.
10) పవన్ కళ్యాణ్ :
‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘కాటమరాయుడు’ ‘అజ్ఞాతవాసి’ వంటి ప్లాప్ లతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కు ‘వకీల్ సాబ్’ చిత్రం మంచి హిట్ అందించింది. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.