సీక్వెల్స్ తో హిట్టు కొట్టలేకపోయిన టాలీవుడ్ హీరోలు వీళ్ళే..!

బాలీవుడ్లో మొదలైన సీక్వెల్ ఫార్ములా మెల్ల మెల్లగా సౌత్ కు కూడా పాకింది. హిట్ అయిన సినిమా క్రేజ్ ను బట్టి అదే డైరెక్టర్ లేదా వేరే డైరెక్టర్.. అదే హీరోతో లేదా అదే థీమ్ తో తెరకెక్కించడం అనేది దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఈ ఫార్ములా బాలీవుడ్లో వర్కౌట్ అయ్యింది, తరువాత కాలీవుడ్లో కూడా కొంతవరకూ వర్కౌట్ అయ్యింది. కానీ టాలీవుడ్ కు వచ్చేసరికి ఈ ఫార్ములా పూర్తిగా ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. సాయి కుమార్ దగ్గర నుండీ మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వరకూ హిట్టు సినిమా సీక్వెల్స్ లో నటించి చేతులు కాల్చుకున్నారు. భీభత్సమైన హైప్ తో ఆ సీక్వెల్స్ విడుదల అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిలిచ్చాయి. సరే హిట్టు సినిమా సీక్వెల్లో నటించి చేతులు కాల్చుకున్న హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) శంకర్ దాదా MBBS : శంకర్ దాదా జిందాబాద్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా జయంత్.సి.పరాన్జీ డైరెక్షన్లో తెరకెక్కిన ‘శంకర్ దాదా MBBS’ చిత్రం 2004 లో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సిక్వెల్ గా 2007 లో వచ్చిన ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రం మాత్రం ప్లాప్ గా మిగిలింది.

2) ఆర్య : ఆర్య2

అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్య’ చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్. 2004లో విడుదలైన ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది కూడా..! అయితే ‘ఆర్య2’ మాత్రం నిరాశపరిచింది.

3) కిక్ : కిక్2

రవితేజ – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది… అయితే దానికి సీక్వెల్ గా వచ్చిన ‘కిక్2’ మాత్రం డిజాస్టర్ గా మిగిలింది.

4) గబ్బర్ సింగ్ : సర్దార్ గబ్బర్ సింగ్

10 ఏళ్ళ పాటు సరైన హిట్టు లేని పవన్ కళ్యాణ్ కు ‘గబ్బర్ సింగ్’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చింది. అయితే దానికి సీక్వెల్ గా వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మాత్రం డిజాస్టర్ గా మిగిలింది.

5) పోలీస్ స్టోరీ : పోలీస్ స్టోరీ2

సాయి కుమార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ‘పోలీస్ స్టోరీ’ చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్. అయితే దానికి సీక్వెల్ గా వచ్చిన ‘పోలీస్ స్టోరీ2’ మాత్రం ప్లాప్ అయ్యింది.

6) గాయం : గాయం2

జగపతి బాబు హీరోగా వచ్చిన ‘గాయం’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అయితే కొన్నేళ్ల తరువాత దానికి సీక్వెల్ గా వచ్చిన ‘గాయం2’ ప్లాప్ అయ్యింది.

7) మంత్ర : మంత్ర2

ఛార్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మంత్ర’ చిత్రం హిట్ అయ్యింది. అయితే దానికి సీక్వెల్ గా వచ్చిన ‘మంత్ర2’ ప్లాప్ అయ్యింది.

8) చంద్రముఖి : నాగవల్లి

రజినీ కాంత్ హీరోగా పి.వాసు డైరెక్షన్లో తెరకెక్కిన ‘చంద్రముఖి’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అయితే దానికి సీక్వెల్ గా వెంకటేష్ తో ‘నాగవల్లి’ ని తెరకెక్కించాడు పి.వాసు. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయి విజయాన్ని సాధించలేదు.

9) ఎన్టీఆర్ కథానాయకుడు : ఎన్టీఆర్ మహానాయకుడు

దివంగత ముఖ్యమంత్రి మరియు టాలీవుడ్ నెంబర్ 1 హీరో అయిన నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్రతో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రాలను రూపొందించాడు ఆయన తనయుడు బాలకృష్ణ. అయితే ఈ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ కొంత పర్వాలేదు అనిపించినా… ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రం మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది.

10) మన్మథుడు : మన్మథుడు 2

నాగార్జున కెరీర్ లో ‘మన్మథుడు’ చిత్రం ఆల్ టైం హిట్ గా నిలిచింది. అయితే చాలా సంవత్సరాల తరువాత దానికి సీక్వెల్ గా వచ్చిన ‘మన్మథుడు2’ చిత్రం నిరాశపరిచింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus