సౌత్ లో ఉన్న స్టార్స్ లో కొంతమంది తాము చేస్తున్న రెగ్యులర్ వర్క్స్ కి మాత్రమే పరిమితం కాకుండా తమలో ఉన్న మల్టీ టాలెంట్ ను కూడా బయట పెట్టారు. ఈ క్రమంలో కొంతమంది స్టార్స్ లిరిసిస్టులుగా కూడా మంచి పాటలు అందించారు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) త్రివిక్రమ్ : ఏంటి.. స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ లిరిసిస్ట్ గా పాటలు రాశారా? ఈ డౌట్ చాలా మందిలో ఉండవచ్చు. కానీ దానికి ఆన్సర్ ‘నిజమే’ అనే క్లారిటీ ఎక్కువ మందికి తెలిసుండదు. రవితేజ హీరోగా 2003 లో ‘ఒక రాజు ఒక రాణి’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో పాటలన్నిటికీ త్రివిక్రమ్ లిరిసిస్ట్ గా వ్యవహరించారు. చక్రి సంగీత దర్శకుడు. దాదాపు 19 ఏళ్ళ తర్వాత అంటే 2022 లో వచ్చిన పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ లో ‘లాలా భీమ్లా’ పాటకు కూడా లిరిక్స్ సమకూర్చారు త్రివిక్రమ్.
2) శివ నిర్వాణ : ‘నిన్ను కోరి’ ‘మజిలీ’ సినిమాలతో టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు శివ నిర్వాణ. ఇతను డైరెక్ట్ చేసిన 4 సినిమాల్లోనూ పాటలు రాశాడు అనే విషయం ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. ‘టక్ జగదీష్’ లో టక్ సాంగ్ కావచ్చు… ఖుషి లో ‘నా రోజా నువ్వే’ సాంగ్ కావచ్చు శివ పెన్ నుండి వచ్చినవి అని ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు.
3) దేవి శ్రీ ప్రసాద్ : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ చాలా మందికి సింగర్ గా కూడా సుపరిచితమే. కానీ మహేష్ బాబు ‘వంశీ’ సినిమాలో ‘వెచ్చ వెచ్చగా’ అనే పాటకు లిరిక్స్ అందించి.. ఆ పాటను అతనే రాశాడన్న సంగతి ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. అలాగే ‘శంకర్ దాదా ఎం బి బి ఎస్’ సినిమాలోని ‘చైల చైలా చైలా’ పాటకు లిరిక్స్ సమకూర్చుకుంది కూడా దేవి శ్రీ నే. ఆ పాట ఎంత చార్ట్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
4) వివేక్ ఆత్రేయ : ‘మెంటల్ మదిలో’ ‘బ్రోచేవారెవరురా’ సినిమాలతో టాప్ డైరెక్టర్ గా ఎదిగిన వివేక్ ఆత్రేయ.. లిరిసిస్ట్ గా కూడా ‘ఈ నగరానికి ఏమైంది’ లో ‘మారే కలలే’, ‘కీడా కోలా’ లో ‘బ్రింగ్ ఇట్ ఆన్’ వంటి పాటలు అందించాడు అని చాలా మందికి తెలిసుండదు.
5) హసిత్ గోలి : ‘రాజ రాజ చోర’ తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాసిత్.. లిరిసిస్ట్ గా ‘బ్రోచేవారెవరురా’ లో వగలాడి వగలాడి, వాలే చినుకులే వంటి పాటలు అందించాడు. ఆ 2 కూడా వినడానికి చాలా బాగుంటాయి.
6) మెహర్ రమేష్ : మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘భోళా శంకర్’ సినిమాలో ‘రేజ్ ఆఫ్ భోళా’ అనే ర్యాప్ సాంగ్ ఉంటుంది. దీనికి లిరిక్స్ అందించింది దర్శకుడు మెహర్ రమేష్ అని చాలా మందికి తెలీదు.
7) శివ కార్తికేయన్ : తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ యోగి బాబు నటించిన ‘గూర్కా’ సినిమాలో ‘హే పోయా’ అనే పాటకు లిరిక్స్ అందించాడు. అది ఆ సినిమా ప్రమోషన్స్ కి బాగా ఉపయోగపడింది.
8) ధనుష్ : కోలీవుడ్ లో ధనుష్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు. తాను చేసే సినిమాల్లో మంచి పాటలు ఉంటే అతనే పాడేస్తాడు. కానీ ‘3’ సినిమాలో ‘వై దిస్ కొలవరి’ , ‘పేట’ సినిమాలో ‘ఇలమై తిరుంబుధే’ వంటి పాటలకి లిరిక్స్ సమకూర్చాడని చాలా మందికి తెలీదు.
9) ఎం.ఎం.కీరవాణి : ఆస్కార్ అవార్డు గ్రహీత, టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి లిరిసిస్ట్ గా కూడా ‘మేజర్ చంద్రకాంత్’ లో ముద్దుల్తో ఓనమాలు, ‘విక్రమార్కుడు’ లో జో లాలి, ‘వేదం’ లో రూపాయ్ , ‘బాహుబలి 2’ లో ‘దండాలయ్యా’, ‘ఆర్.ఆర్.ఆర్’ లో జనని వంటి పాటలకు లిరిక్స్ సమకూర్చుకున్నారు.
10) రామ్ పోతినేని : ఎనర్జిటిక్ స్టార్ రామ్… హీరోగా రాణిస్తున్నాడు. కానీ ఇతనిలో మంచి లిరిసిస్ట్ ఉన్నాడని ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా నుండి వచ్చిన నువ్వుంటే చాలే సాంగ్ ప్రూవ్ చేసింది. తాజాగా రిలీజ్ అయిన ఈ లిరికల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.