‘ప్రభాస్ 20’ సినిమా బడ్జెట్ కు లాక్ డౌన్ ఎఫెక్ట్?

ప్రభాస్ గత చిత్రం ‘సాహో’ కి ఏకంగా 350 కోట్ల బడ్జెట్ పెట్టారు. ‘బాహుబలి’ తో ప్రభాస్ కు వచ్చిన క్రేజ్ కారణంగా ఆ బడ్జెట్ చాలా వరకూ రికవర్ అయిపోయింది. అయితే ‘ప్రభాస్ 20’ విషయంలో నిర్మాతలు జాగ్రత్త పడతారు అని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రానికి కూడా భారీ బడ్జెట్ పెట్టాల్సి వస్తుందట. మొదట ఈ చిత్రాన్ని 150 కోట్ల బడ్జెట్ లోపే ఫినిష్ చెయ్యాలి అని నిర్మాతలు అనుకున్నారట. ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘గోపికృష్ణ మూవీస్’ వారు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి కూడా 200కోట్ల పైనే బడ్జెట్ అవుతుందని తెలుస్తుంది. అసలు విషయం ఏమిటంటే.. ఈ చిత్రం షూటింగ్ ను ఆస్ట్రియా,జార్జియా వంటి దేశాల్లో నిర్వహించాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఓ వైరస్ మహమ్మారి వల్ల.. ఇతర దేశాలకు వెళ్లి షూటింగ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జార్జియా, ఆస్ట్రియా వంటి దేశాలను తెచ్చేస్తున్నారట. అదేనండీ.. ఆ దేశాల సెట్ లను వేసి అందులో షూటింగ్ నిర్వహించాలి అని ప్లాన్ చేస్తున్నారట.

దాంతో బడ్జెట్ భారీగా పెరిగిపోతుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని టాక్ నడుస్తుంది. షూటింగ్ మొదలైన వెంటనే ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయబోతున్నారట నిర్మాతలు. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus