Lokesh Kanagaraj: వెయ్యి మంది కష్టపడ్డాం… ఆ సీన్స్‌ అస్సలు మిస్‌ అవ్వొద్దు: లోకేశ్‌

  • October 16, 2023 / 12:13 PM IST

ఇప్పుడు తగ్గిపోయింది కానీ… ఒకప్పుడు సినిమా రిలీజ్‌ అవుతోంది అంటే.. ‘ఫస్ట్‌ పది నిమిషాలు మిస్ అవ్వొద్దు’ అనే మాట వినిపించేది. సినిమా పోస్టర్‌లపై ఈ విషయం ప్రముఖంగా రాసేవారు కూడా. దీంతో ఆ సినిమా వెళ్లాలి అనుకునే జనాలు.. కచ్చితంగా ఓ ఐదు నిమిషలు ముందే వెళ్లేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ఎక్కడా అలాంటి కామెంట్లు కనిపించడం లేదు. అయితే ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ ఇప్పుడు ఈ మాట చెప్పారు.

విజయ్‌తో లోకేశ్ తెరకెక్కించిన చిత్రం ‘లియో’. దసరా సందర్భంగా ఈ సినిమా అక్టోబరు 19న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతున్న ఆయన ఇటీవల ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. సినిమాకు వచ్చేవాళ్లు ఎట్టి పరిస్థితుల్లో తొలి పది నిమిషాలు మిస్‌ అవ్వొద్దు అని చెప్పాడు. దీంతో అంతగా ఫస్ట్‌ టెన్‌ మినిట్స్‌లో ఏముందబ్బా… అంత స్పెషల్‌ ఏముంది అంటూ ఫ్యాన్స్‌ మాట్లాడుకుంటున్నారు.

సినిమా ట్రైలర్‌ చూసినవాళ్లకు కొంతమందికి నచ్చలేదు, కొంతమందేమో చాలా తెలివిగా కట్‌ చేశారు అని అంటున్నారు. మరికొందరమో చాలా విషయాలు దాచారు అని అంటున్నారు. ఇప్పుడు మొదటి పది నిమిషాలు మిస్‌ అవ్వొద్దు అనేసరికి ఆ టైమ్‌లో ఏం చూపిస్తారో అని లెక్కలేస్తున్నారు. ‘లియో’ కోసం వెయ్యి మంది కంటే ఎక్కువ మంది పనిచేశారు. అదిరిపోయే అవుట్‌పుట్‌ వచ్చింది. ఇంతవరకు చూడని సినిమాటిక్‌ ఫీల్‌ ‘లియో’లో ఉంటుంది అని అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు దర్శకుడు లోకేశ్‌.

‘విక్రమ్‌’ లాంటి సూపర్‌ హిట్‌ సినిమా తర్వాత (Lokesh Kanagaraj) లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. అలాగే వారసుడు, బీస్ట్‌ అంటూ రెండు సరైన విజయాలు లేని పరిస్థితుల్లో విజయ్‌ ఈ సినిమా చేశాడు. దీంతో ఈ సినిమా మీద అభిమానులు పెద్ద నమ్మకమే పెట్టుకున్నారు. మరి ‘ఎల్‌సీయూ’ (లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌)లో ఈ సినిమా ఉందా లేదా అనేది కూడా ప్రశ్నే. మరి లోకేశ్‌ ఏం చేశారో చూడాలి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus