Lokesh Kanagaraj: ‘ఖైదీ’ సినిమా షూట్‌లో కార్తి చేసిన పని చెప్పిన లోకేశ్!

  • June 21, 2022 / 03:02 PM IST

సినిమాలో కంటిన్యుటి అనే ఓ పదం ఉంటుంది. అంటే… వేర్వేరు సందర్భాల్లో తీసిన షాట్స్‌ని సులభంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలిపేసేలా జాగ్రత్తగా సీన్స్‌ తీస్తుంటారు. ఇలాంటి కంటిన్యుటినీ మిస్‌ అయిపోతే.. సినిమాలో తప్పులు వస్తుంటాయి. అంటే ఓ షాట్‌లో హీరో ఒక దగ్గర ఉంటే, మరో షాట్‌లో కొంచెం సైడ్‌కి ఉంటాడు. దీని వల్ల సినిమాకు ప్రేక్షకుడు డిస్‌కనెక్ట్‌ అవుతాడు అంటుంటాడు. ఇలాంటి కంటిన్యుటీ గురించి డైరక్షన్‌ టీమ్‌ చూసుకుంటూ ఉంటుంది.

దీని కోసమే ఆ టీమ్‌ ఓ వ్యక్తి ఉంటారు. అయితే అదే పని ఓ హీరో చేస్తే… అది కార్తి అవుతాడు అనొచ్చు. ‘ఖైదీ’ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ఓ సంఘటనను దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అప్పుడే కార్తికి సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు లోకేశ్‌. ‘ఖైదీ’ సినిమాలో ఓ ఫైట్‌ సీన్‌ ఉంటుంది.

అందులో కార్తికి మొత్తం మట్టి అంటుకుపోయుంటుంది. ఆ సీన్‌ అయిపోయిన తర్వాత… దాని ప్యాచ్‌ వర్క్‌ను చెన్నైలో చేశారట. అయితే దీనికి కాస్త టైమ్‌ పట్టిందట. షూట్‌ రోజున కార్తి రెడీ అవ్వగానే.. లోకేశ్‌ వచ్చి సీన్‌ కంటిన్యుటిగా మీ డ్రెస్‌కి మట్టి ఉండాలి అని గుర్తు చేశారట. దాంతోపాటు పూసుకోండి అంటూ మట్టి కూడా ఇచ్చారట లోకేశ్‌ టీమ్‌. కానీ కార్తి దానికి నో చెప్పారట. దానికి కారణం అంతకుముందు షాట్‌లో ఒంటికి ఉన్న మట్టి,

ఇప్పుడు ఇచ్చిన మట్టి ఒకేలా లేకపోవడమేనట. రెండూ ఒకేలా ఉండకపోవడంతో కంటిన్యుటీ మిస్‌ అవుతుందని. దీంతో ఎలా అని టీమ్‌ అనుకుంటుండగా… ఆ రోజు సీన్‌ పూర్తయ్యాక అక్కడ మట్టిని తీయమని కార్తి అసిస్టెంట్‌ డైరక్టర్‌కి చెప్పారట. ఆ మట్టిని ఆ ఏడీ నుండి తీసుకొని ఒంటికి పూసుకున్నారట కార్తి. సినిమా అంటే కార్తి ప్యాషన్‌ ఎలా ఉంటుందో ఈ ఒక్క ఘటనతో తెలుసుకోవచ్చు అని చెప్పారు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. కార్తి హీరో అవ్వకముందు దర్శకత్వ విభాగంలో కూడా పని చేసిన విషయం తెలిసిందే. కాబట్టి కంటిన్యుటీ కష్టాలు, ఉపయోగాలు బాగా తెలిసి ఉండొచ్చు.

Most Recommended Video

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus