Naga Chaitanya Sai Pallavi: చైతు, సాయి పల్లవి లవ్ స్టోరీ వాయిదా!

  • August 21, 2021 / 12:12 PM IST

క్లాస్ సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుంటూ ప్రస్తుతం కొనసాగుతున్నారు శేఖర్ కమ్ముల. తన కెరీర్ లో హ్యాపీ డేస్ మూవీ తో అతి పెద్ద విజయం అందుకున్న శేఖర్ కమ్ముల ఆ తరువాత ఇటీవల వచ్చిన ఫిదా మూవీ తో మరొక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య సాయి పల్లవి లతో శేఖర్ కమ్ముల తీసిన లేటెస్ట్ సినిమా లవ్ స్టోరీ. యువ సంగీత దర్శకుడు పవన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో భారీ వ్యూస్ సొంతం చేసుకోవడంతో పాటు ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ దక్కించుకున్నాయి.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమాని సెప్టెంబర్ 10న థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే సరిగ్గా అదే రోజున నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ తీస్తున్న టక్ జగదీశ్ కూడా అమెజాన్ ప్రైమ్ ఓటిటి ద్వారా ఆడియన్స్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక నేడు తెలంగాణ మూవీ థియేటర్స్ ఓనర్స్, మూవీ ప్రొడ్యూసర్స్ కలిసి జరిపిన ప్రత్యేక మీటింగ్ లో భాగంగా లవ్ స్టోరీ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన ఏషియన్ సునీల్ మాట్లాడుతూ, తమ సినిమాని ఇటీవల సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించామని,

అయితే సరిగ్గా అదేరోజున నాని గారి మూవీ ఓటిటి లో రిలీజ్ చేసేలా ఆ మూవీ నిర్మాతలు ప్లాన్ చేయడం సరైనది కాదని, వారు ఈ విషయమై మరొక్కసారి ఆలోచించాలని కోరారు. అయితే టక్ జగదీష్ అమెజాన్ లో రిలీజ్ డేట్ పక్కాగా ఫిక్స్ అయిందని, త్వరలో దాని అధికారక ప్రకటన కూడా రావడం ఖాయం అని తెలియడంతో తమ లవ్ స్టోరీమూవీని మరొక వారం పాటు వాయిదా వేయాలని ఆ మూవీ ప్రొడ్యూసర్స్ డిసైడ్ అయ్యారట. అయితే ఈ విషయమై పూర్తి నిజానిజాలు మాత్రం వెల్లడి కావాల్సి ఉంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus