Love Today Collections: రెండో వీకెండ్ ను కూడా బాగా వాడుకున్న ‘లవ్ టుడే’.!

  • December 5, 2022 / 07:34 PM IST

ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా ఇవాన హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘లవ్ టుడే’. ఈ చిత్రానికి దర్శకుడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌నే కావడం మరో విశేషం. ‘ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై కల్పతి ఎస్ అఘోరం,కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆల్రెడీ త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. నవంబర్ 25న ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై రిలీజ్ చేశారు.

దీంతో మొదటి నుండి ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి రోజు సూపర్ హిట్ టాక్ రావడంతో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించింది ‘లవ్ టుడే’. రెండో వీకెండ్ ను కూడా బాగా వాడుకుంది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 3.02 cr
సీడెడ్ 1.20 cr
ఆంధ్ర 2.30 cr
ఏపీ +తెలంగాణ 6.52 cr

‘లవ్ టుడే’ చిత్రానికి తెలుగులో రూ.2.35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2.60 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసిన ఈ మూవీ 10 రోజులు పూర్తయ్యేసరికి .. రూ.6.52 కోట్ల షేర్ ను రాబట్టింది

ఇప్పటివరకు ఈ మూవీ రూ.3.92 కోట్ల లాభాలను బయ్యర్స్ కు అందించింది. కొత్త సినిమాలు రిలీజ్ అయినా ఈ మూవీ ఇలా కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus