ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఇవాన హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘లవ్ టుడే’. ఈ చిత్రానికి దర్శకుడు ప్రదీప్ రంగనాథనే కావడం మరో విశేషం. ‘ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై కల్పతి ఎస్ అఘోరం,కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆల్రెడీ తమిళంలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. నవంబర్ 25న ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది.
తెలుగులో ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై రిలీజ్ చేశారు. దీంతో మొదటి నుండి ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి రోజు సూపర్ హిట్ టాక్ రావడంతో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించింది ‘లవ్ టుడే’. రెండో వీకెండ్ ను కూడా బాగా వాడుకుంది.నిన్న 11వ రోజు కూడా ఈ మూవీ పర్వాలేదు అనిపించింది. ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
3.10 cr
సీడెడ్
1.25 cr
ఆంధ్ర
2.38 cr
ఏపీ +తెలంగాణ
6.73 cr
‘లవ్ టుడే’ చిత్రానికి తెలుగులో రూ.2.35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2.60 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసిన ఈ మూవీ 11 రోజులు పూర్తయ్యేసరికి .. రూ.6.73 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటివరకు ఈ మూవీ రూ.4.13 కోట్ల లాభాలను అందించి డబుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో ఎంటర్ అయ్యింది.