Love Today Collections: 15వ రోజు కూడా పర్వాలేదనిపించిన.. ‘లవ్ టుడే’ కలెక్షన్స్.!

  • December 10, 2022 / 06:18 PM IST

ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా ఇవాన హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘లవ్ టుడే’. ఈ చిత్రానికి దర్శకుడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌నే కావడం మరో విశేషం. ‘ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై కల్పతి ఎస్ అఘోరం,కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆల్రెడీ త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. నవంబర్ 25న ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది.

తెలుగులో ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై రిలీజ్ చేశారు. దీంతో మొదటి నుండి ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి రోజు సూపర్ హిట్ టాక్ రావడంతో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించింది ‘లవ్ టుడే’.15వ రోజు కూడా ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది. ఒకసారి 15 డేస్ కలెక్షన్స్:

నైజాం 3.23 cr
సీడెడ్ 1.36 cr
ఆంధ్ర 2.56 cr
ఏపీ +తెలంగాణ 7.15 cr

‘లవ్ టుడే’ చిత్రానికి తెలుగులో రూ.2.35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2.60 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసిన ఈ మూవీ 2 వారాలు పూర్తయ్యేసరికి .. రూ.7.15 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటివరకు ఈ మూవీ రూ.4.55 కోట్ల లాభాలను అందించి డబుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి ఎంటర్ అయ్యింది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus