Lucky Baskhar Collections: ‘లక్కీ భాస్కర్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..?

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా వెంకీ అట్లూరి (Venky Atluri)  దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ మూవీ ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar)  . మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ  (Suryadevara Naga Vamsi )  నిర్మించగా జి.వి.ప్రకాష్ సంగీతం అందించాడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. 30న ప్రీమియర్ షోలు కూడా వేశారు. వాటికి మంచి స్పందన లభించింది. దీంతో ఓపెనింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి.

Lucky Baskhar Collections

ఒకసారి ‘లక్కీ భాస్కర్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.55 cr
సీడెడ్ 0.38 cr
ఆంధ్ర(టోటల్) 1.01 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 2.94 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.08 cr
ఓవర్సీస్ 0.12 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 3.14 cr

‘లక్కీ భాస్కర్’ (తెలుగు వెర్షన్) కి రూ.11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రం రూ.3.14 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.8.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ ముగిసేసరికి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

బ్లాక్ బస్టర్ సీక్వెల్ ని నిరంజన్ రెడ్డి ఎలా వదులుకున్నారు.. కారణాలు ఇవేనా..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus