24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే..!

2020 సంక్రాంతికి బాక్సాఫీస్ మారుమోగిపోవడం ఖాయమని ఈపాటికే అందరికీ అర్థమైపోయుంటుంది. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలు సంక్రాంతి బరిలో పోటీబడనున్నాయి. ప్రమోషన్ల విషయంలో మొన్నటి వరకూ ‘అల వైకుంఠపురములో’ టీం ముందుంది. అయితే ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ టీం కూడా ఎక్కడా తగ్గలేదు. టీజర్ తో సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశారు. ఇక డిసెంబర్ 2న (సోమవారం) నాడు విడుదల చేసిన ‘మైండ్ బ్లాక్’ పాటకి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండడం విశేషం.

పాట సో.. సో గానే ఉన్నప్పటికీ మాస్ సాంగ్ కావడంతో.. అందులోనూ మహేష్ వాయిస్ కూడా అక్కడక్కడా వస్తుండడంతో ఈ పాటకి మంచి ఆధరణ దక్కిందని చెప్పొచ్చు. ఇక ఈ లిరికల్ సాంగ్ 24 గంటల్లో 7.87 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతానికి నెంబర్ 1 పొజిషన్లో ఉన్న సాంగ్ ఇదే..! అయితే లైక్స్ మాత్రం పెద్దగా రాలేదనే చెప్పాలి. ఈ పాటకి కేవలం 133K లైక్స్ మాత్రమే వచ్చాయి. ఇక 24 గంటల్లో అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ ను రాబట్టిన లిరికల్ సాంగ్స్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి.

1) మైండ్ బ్లాక్ (సరిలేరు నీకెవ్వరు) : 7.87 మిలియన్ వ్యూస్ , 133K లైక్స్

2) రాములో రాములా(అల వైకుంఠపురములో) : 7.39 మిలియన్ వ్యూస్ , 315K లైక్స్

3) సామాజవరగమన(అల వైకుంఠపురములో) : 5.11 మిలియన్ వ్యూస్ , 312K లైక్స్

4) వచ్చాడయ్యో సామి(భరత్ అనే నేను) : 3.28 మిలియన్ వ్యూస్, 189K లైక్స్

5) ఓ మై గాడ్ డాడీ(అల వైకుంఠపురములో) : 3.21 మిలియన్ వ్యూస్ , 172K లైక్స్

6) చోటి చోటి (మహర్షి) : 3.20 మిలియన్ వ్యూస్ , 130K లైక్స్

7) థిస్ ఈజ్ మి(భరత్ అనే నేను) : 3.15 మిలియన్ వ్యూస్ , 187K లైక్స్

8) రంగమ్మ మంగమ్మ (రంగస్థలం) : 3.06 మిలియన్ వ్యూస్ , 152K లైక్స్

9) ఎంత సక్కగున్నావే (రంగస్థలం) : 3.02 మిలియన్ వ్యూస్, 146K లైక్స్

10) పెనివిటి(అరవింద సమేత) : 2.91 మిలియన్ వ్యూస్, 150K లైక్స్

11) అనగనగా (అరవింద సమేత) : 2.61 మిలియన్ వ్యూస్, 144K లైక్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus