Polimera 2 First Review: ‘పొలిమేర 2’ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

2 ఏళ్ళ క్రితం అంటే 2021 లో ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా ఓటీటీలో(డిస్నీ ప్లస్ హాట్ స్టార్) లో నేరుగా రిలీజ్ అయ్యింది. మొదట ఈ సినిమాని గ్రామీణ నేపథ్యంలో చేసిన రా అండ్ ఇంటెన్స్ మూవీ అనుకున్నారు. కానీ ఇందులో చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయి అని చూశాక ఆశ్చర్యపడ్డారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ లు అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాకి సెకండ్ పార్ట్ గా ‘మా ఊరి పొలిమేర 2 ‘ ని రూపొందించాడు

దర్శకుడు అనిల్ విశ్వనాథ్.సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గౌరీ కృష్ణ నిర్మాత. నవంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.టీజర్, ట్రైలర్స్ కూడా బాగా ఇంప్రెస్ చేశాయి. మొదటి రోజు ఎక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా ‘పొలిమేర 2 ‘ (Polimera 2) చిత్రాన్ని.. కొంతమంది ఎగ్జిబిటర్స్ కోసం స్పెషల్ షో వేయడం జరిగింది. వాళ్ళు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ చెప్పినట్లు తెలుస్తుంది. ‘పొలిమేర ‘ మొదటి భాగంలో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు.. ఈ సినిమాలో బ్యాక్ టు బ్యాక్ వచ్చాయని అంటున్నారు. గ్లామర్ డోస్ ఎక్కువైనా.. థియేటర్ ఆడియన్స్ కోసం ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం బూతులు వంటివి మ్యూట్ చేసినట్లు చెబుతున్నారు.

సినిమా 2 గంటల 7 నిమిషాలు నిడివి కలిగి ఉండటం అనేది ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు. ‘పొలిమేర’ మొదటి భాగం చూసిన వాళ్లకి.. ఈ సినిమా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది అని వారు తెలియజేశారు. మరి ఓటీటీలో అద్భుతాలు చేసిన ‘పొలిమేర ‘ లా.. ‘పొలిమేర 2 ‘ థియేటర్స్ లో అద్భుతాలు చేస్తుందా లేదా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా డిస్ట్రిబ్యూటర్స్ నుండి అయితే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus