Maadhavi Latha: బాలయ్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన మాధవీలత.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా బాలయ్యకు ప్రేక్షకుల్లో ఉన్న గుర్తింపు అంతాఇంతా కాదు. ఎమ్మెల్యేగా కూడా బాలయ్య మంచి పేరు సంపాదించుకున్నారు. హిందూపురం అభివృద్ధి కోసం బాలయ్య ఎన్నో కార్యక్రమాలు చేశారు. తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ సభలలో బాలయ్య మీసాలు మెలేయడంతో పాటు విజిల్ వేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. టీడీపీ ముఖ్య నేతలను బాలయ్య తరచూ కలుస్తూ పార్టీకి ఎలాంటి కష్టం రాకుండా బాలయ్య జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత తాజాగా బాలయ్య గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. బాలయ్యను మాధవీలత టార్గెట్ చేయడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అసెంబ్లీలో బాలయ్య సైగల గురించి కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించగా మాధవీలత స్పందిస్తూ “అంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్న రౌడీలు.. సారీ.. నేను తప్పు చెప్పాను.. వీళ్లను ఎమ్మెల్యేలు అంటారు అనుకుంటా కదా” అని అన్నారు.

బాలయ్య ఫోటోను పోస్ట్ చేస్తూ మాధవీలత ఈ కామెంట్లు చేయడం గమనార్హం. (Maadhavi Latha) మాధవీలత ఈ విధంగా కామెంట్లు చేయడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే తనపై వచ్చే ట్రోల్స్ గురించి మాధవీలత స్పందిస్తూ “హాహాహాహా ప్రతివాడు వాడికి నచ్చేలా పోస్ట్స్ పెట్టాలని అశ పడతాడని ఇప్పుడు 5 లక్షల మంది మెంటాలిటీని ఎలా రీడ్ చేయాలి” అని చెప్పుకొచ్చారు.

బొ*లోది.. ఇది నా పేజ్.. నాకు నచ్చిందే పెడతాను.. నాకు 360 డిగ్రీల్లోనూ పర్ఫెక్ట్ అనుకున్న దానినే నేను పోస్ట్ చేస్తానని నా దేవుడు కృష్ణుడు చెప్పిన రాజనీతిని పెడతానని చస్తే చావండి నాకేంటి గెటౌట్” అని మాధవీలత కామెంట్లు చేశారు. మాధవీలత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus