‘బిగ్ బాస్5’ లో కొద్ది రోజుల నుండీ మానస్, ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ లు కొద్ది రోజుల నుండీ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. పింకీ.. మానస్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతుండడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. మానస్ అయితే హౌస్ లో ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టకుండా గేమ్ ఆడుతున్నాడు. దాంతో అతని పై నెగిటివిటీ ఏమీ లేదు. అయితే.. ‘దేవుడు నాకు మంచి లైఫ్ కనుక ఇచ్చి ఉంటే .. నీతో హ్యాపీగా ఉండేదాన్ని’ అంటూ అర్ధరాత్రి పూట పింకీ తో చెప్పడం,
అలాగే మానస్ హజ్బ్యాండ్ మెటీరియల్ అంటూ పింకీ ఓ సందర్భంలో చెప్పడంతో ఆమె రోజు రోజుకీ మానస్ పై ఆశలు పెట్టేసుకుంటున్నట్టు స్పష్టమవుతుంది. ఈ విషయాల పై మానస్ తల్లి పద్మిని స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ… ” ప్రియాంక సింగ్ చాలా మంచి అమ్మాయి. ఆమె నాకు చాలా ఇష్టం. ‘మానస్‌ను హజ్బెండ్ మెటీరియల్’ అని పింకీ అన్న మాట నిజం. కానీ, మానస్ మాత్రం ఆమెను మరదలని మాత్రమే చెప్పాడు. ‘బిగ్‌బాస్’ అనేది 110 రోజుల గేమ్. ఇందులో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది పెళ్లిళ్లు చేసుకున్నారు? అదంతా షోలో ఒక భాగం.
అక్కడి వరకే అన్నీ.! హౌస్ అన్నాక.. ఒకరితో ఒకరు మాట్లాడకుంటారు. మాట్లాడకుండా ఎలా ఉంటారు? అది ఫ్రెండ్షిప్ మాత్రమే. హౌస్‌లో మానస్ కి సెట్ అయ్యే వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఏ అమ్మాయిని చూపిస్తే మానస్ ఆమెనే పెళ్ళి చేసుకుంటాడు. ప్రియాంక సింగ్.. నా కొడుకుని పెళ్లి చేసుకుంటానంటే మాత్రం ఒప్పుకోను.కావాలంటే ఆమెకి తగిన మ్యాచ్ చూసి నేను పెళ్ళి చేస్తా. ఆ రకంగా నేను ప్రియాంక సింగ్ కు నేను సపోర్ట్ చేస్తాను, ఎలాంటి సాయం అయినా చేస్తాను” అంటూ చెప్పుకొచ్చింది.