Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘మ్యాడ్’ చిత్రం మ్యాడ్ బ్లాక్ బస్టర్ అవుతుంది: దుల్కర్ సల్మాన్

‘మ్యాడ్’ చిత్రం మ్యాడ్ బ్లాక్ బస్టర్ అవుతుంది: దుల్కర్ సల్మాన్

  • October 5, 2023 / 05:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మ్యాడ్’ చిత్రం మ్యాడ్ బ్లాక్ బస్టర్ అవుతుంది: దుల్కర్ సల్మాన్

ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’. సూర్యదేవర నాగ వంశీ సమర్పిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ వినోదాత్మక చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 6న థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. బుధవారం సాయంత్రం మ్యాడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది. యువత కేరింతల నడుమ ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకు దుల్కర్ సల్మాన్, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీల, దర్శకుడు వెంకీ అట్లూరి, దర్శకుడు అనుదీప్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నేను సితార బ్యానర్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు సినిమా చేస్తున్నాను. ఆ సినిమా పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. మ్యాడ్ విషయానికొస్తే ట్రైలర్ నిజంగానే మ్యాడ్ గా, చాలా ఫన్నీగా ఉంది. నటీనటులు ఎవరూ కొత్తవాళ్ళ లాగా లేరు. చాలా బాగా చేశారు. భీమ్స్ గారి మ్యూజిక్ చాలా బాగుంది. ఆ మ్యూజిక్ విని నాకు తెలియకుండానే కాలు కదుపుతున్నాను. షామ్ దత్ గారి వర్క్ సూపర్బ్. హారిక, చినబాబు గారు, వంశీ గారు అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మ్యాడ్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నాను. సిద్ధు నీ టిల్లు స్క్వేర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. శ్రీలీల ఒకేసారి చాలా సినిమాలు చేస్తుంది. నేను తన డ్యాన్స్ చూసి సర్ ప్రైజ్ అవుతాను. ఆల్ ది బెస్ట్.” అన్నారు.

సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. “సితార సినిమా అంటే నా సినిమా లాంటిది. మొదట కళ్యాణ్ మ్యాడ్ స్టోరీ లైన్ ని నాకు చెప్పినప్పుడు, చాలా ఎంజాయ్ చేస్తాను. ఇది ఖచ్చితంగా చేయాల్సిన అప్పుడే అనిపించింది. ఈరోజు కళ్యాణ్ ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నితిన్, రామ్, సంగీత్, గౌరీ, అనంతిక, గోపిక.. మీరందరూ సితార బ్యానర్ నిర్మించిన సినిమాలో భాగం కావడం లక్కీ. సితార వాళ్ళు సినిమా గురించి తప్ప ఖర్చు గురించి గానీ, టైం గురించి గానీ పట్టించుకోరు. సినిమా కరెక్ట్ గా రావాలని మాత్రమే చూస్తారు. ఈ సినిమాతో నిర్మాతగా పరిచయమవుతున్న చినబాబు గారి కుమార్తె హారికకి ఆల్ ది బెస్ట్. టిల్లు స్క్వేర్ కి కళ్యాణ్ కూడా ఒక రైటర్. అతను ఎలా ఆలోచిస్తాడో, ఎలా రాస్తాడో నాకు తెలుసు. ఈ సినిమా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. నాగవంశీ గారు ఇప్పటికే చెప్పినట్టు జాతిరత్నాలుకి ఏమాత్రం తగ్గకుండా ఎంజాయ్ చేస్తారు. దుల్కర్ గారు చాలా నైస్ పర్సన్. చినబాబు గారు ఈరోజు మధ్యాహ్నం ఒక విషయం చెప్పారు. అది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. ఇవాళ గుంటూరు కారం సాంగ్ షూట్ నుంచి వచ్చారంట. చినబాబు గారి గొంతులో నేను అంత ఎక్సైట్ మెంట్ చాలారోజుల తర్వాత విన్నాను. సాంగ్ సూపర్ వచ్చింది, థియేటర్లు తగలబడిపోతాయి అన్నారు ఆయన.” అన్నారు.

శ్రీలీల మాట్లాడుతూ.. “రీసెంట్ గా గుంటూరు కారం షూటింగ్ లొకేషన్ లో నేను అటుఇటు నడుస్తుండగా నిర్మాతలు మ్యాడ్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఈ సినిమా గురించి తెలుసుకున్నాను. ఈ సినిమా ఈవెంట్ కి రావడం సంతోషంగా ఉంది. నాకు జాతిరత్నాలు చూసినప్పటి నుంచి ఇలాంటి హిలేరియస్ సినిమాలంటే చాలా ఇష్టం. నేను సితారలో ఆదికేశవ సినిమా చేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమాతో అలరిస్తాం. ఈ మ్యాడ్ సినిమా మ్యాడ్ ఉంటదంట. అందరూ చూసి ఎంజాయ్ చేయండి” అన్నారు.

సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. “సంవత్సరం ముందు సినిమా స్టార్ట్ చేశాం. అక్టోబర్ 5, 2022 ఫస్ట్ డే షూట్ జరిగింది. అక్టోబర్ 6, 2023 సినిమా విడుదలవుతుంది. ఒక సంవత్సరం మొత్తం చాలా కష్టపడ్డాం. ఆ కష్టంలో చాలామందికి థాంక్స్ చెప్పుకోవాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి, టెక్నీషియన్స్, నా తోటి నటీనటులు అందరికీ థాంక్స్. డైరెక్టర్ కళ్యాణ్ అన్న మొదట మ్యాడ్ కథని సిద్ధు అన్నకి చెప్పారు. సిద్ధు అన్ననే వంశీ అన్న దగ్గరకు తీసుకొచ్చారు. అలా మ్యాడ్ సినిమా రావడానికి సిద్ధు అన్న కారణమయ్యాడు. దుల్కర్ గారికి పెద్ద అభిమానిని. మా అన్న సంతోష్ నటించిన అన్నీ మంచి శకునములే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దుల్కర్ గెస్ట్ గా వచ్చారు. ఆ సమయంలో మా అన్న దుల్కర్ తో టైం స్పెండ్ చేశాడు. ఇక ఆ తర్వాత రోజు వచ్చి దుల్కర్ ఎంత సింపుల్ గా ఉన్నాడురా అని చెబుతూనే ఉన్నాడు. అప్పుడే అనుకున్న నాక్కూడా ఒకరోజు వస్తుందని. సరిగ్గా నాలుగు నెలలకే ఇప్పుడు దుల్కర్ నా సినిమాకి గెస్ట్ గా రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ట్రైలర్ లాంచ్ చేసిన తారక్ అన్నకి థాంక్స్. ప్రపంచాన్ని జయించినంత ఆనందం వచ్చింది. చినబాబు గారు తక్కువ మాట్లాడతారు, కానీ అందరినీ గైడ్ చేస్తారు. హారిక ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. వంశీ అన్న మాకు బ్యాక్ బోన్ గా నిలిచారు. మ్యాడ్ సినిమాలో నన్ను ముందుగా ఎంపిక చేసినందుకు కళ్యాణ్ గారికి థాంక్స్. మా టీజర్, ట్రైలర్ నచ్చి, ఎంటర్టైన్మెంట్ ఉంటుందని నమ్మితే థియేటర్లకు రండి. మీ ఎంటర్టైన్మెంట్ మా బాధ్యత. మీరు పెట్టిన ప్రతి రూపాయికి తగ్గ వినోదాన్ని మేము అందిస్తాం” అన్నారు.

నార్నే నితిన్ మాట్లాడుతూ.. “ముందుగా మా దర్శకుడు కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవాలి. మేమేదో పని చేయడానికో, షూట్ కో వెళ్తున్నట్టు ఏరోజు కూడా మాకు అనిపించలేదు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఆయన నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తూ ఉన్నారు. రేప్పొద్దున థియేటర్లలో మీ అందరినీ కూడా నవ్విస్తాడు. నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ కళ్యాణ్ అన్నా. ఈ సినిమాని మొదటి నుంచి నమ్మి ఇంత గ్రాండ్ గా నిర్మించినందుకు మా చినబాబు గారికి, వంశీ గారికి, హారిక గారికి థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంత మంచి పాటలిచ్చిన భీమ్స్ గారికి థాంక్స్. బావ(జూనియర్ ఎన్టీఆర్) గురించి మాట్లాడుకోవాలి, బావకి థాంక్స్ చెప్పుకోవాలి. ఈరోజు మాకు ఇంత సపోర్ట్ ఉంది, మాకు ఇంతమంది బ్లెస్సింగ్స్ ఉన్నాయంటే ఆయన వల్లే. ఆయన ఎప్పుడూ నాకు సపోర్ట్ గా ఉన్నారు. థాంక్యూ బావ. అక్టోబర్ 6న థియేటర్లలో కలుద్దాం” అన్నారు.

రామ్ నితిన్ మాట్లాడుతూ.. “నాకు ఈ సినిమాలో నటించే అవకాశమిచ్చిన నిర్మాతలు చినబాబు గారికి, నాగవంశీ గారికి, హారిక గారికి చాలా థాంక్స్. నేను ఈ పాత్ర చేయగలనని నమ్మిన దర్శకుడు కళ్యాణ్ గారికి చాలా థాంక్స్. నన్ను ఇంత బాగా చూపించిన షామ్‌దత్ గారికి, దినేష్ గారికి చాలా థాంక్స్. సంగీతంతో సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లిన భీమ్స్ గారికి చాలా థాంక్స్. నేను యాక్టర్ ని అవుతానని చెప్పినప్పుడు.. నన్ను ప్రోత్సహించిన నా పేరెంట్స్ కి థాంక్స్. ఇది నా మొదటి సినిమా. భవిష్యత్ లో దుల్కర్ గారు చేసిన జనతా హోటల్ తరహా పాత్రలు చేయాలనుంది.” అన్నారు.

చిత్ర దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ.. “ముందుగా చినబాబు గారికి థాంక్యూ సో మచ్ సార్. ఒక చిన్న సినిమా ఐడియా చెబుదామా వద్దా అనే డౌట్ తో మీ దగ్గరకు వచ్చాను. కానీ కథ వినగానే మీరు సినిమా చేయడానికి అంగీకరించినందుకు థాంక్స్. వంశీ అన్న ఎప్పుడూ వెనకుండి ప్రోత్సహిస్తూ ఉంటారు. మాతో పాటే హారిక గారు నిర్మాతగా పరిచయమవుతున్నారు. స్క్రిప్ట్ స్టార్ట్ చేసిన మొదటిరోజు నుంచి మాతో ట్రావెల్ అయ్యారు. మొదట ఈ కథ ఐడియాని సిద్ధుకి చెప్పినప్పుడు.. బాగుందని చెప్పి వంశీ అన్నతో మాట్లాడించాడు. ఎడిటర్ నవీన్ నూలి అన్న సినిమాని తీర్చిదిద్దిన విధానం వేరే లెవెల్. ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన భీమ్స్ అన్నకి లవ్ యూ. డీఓపీలు షామ్ గారు, దినేష్ సినిమాని అందంగా తీశారు. అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి స్పెషల్ థాంక్స్. మా హీరోల గురించి సక్సెస్ మీట్ లో స్పెషల్ గా మాట్లాడతాను. నా ఫ్రెండ్ అనుదీప్ లేకపోతే నేను లేను. థాంక్యూ అనుదీప్” అన్నారు.

దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ.. “కొత్తవారిని ప్రోత్సహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించిన నాగవంశీ గారికి, చినబాబు గారికి ధన్యవాదాలు. ఈ సినిమా దర్శకుడు నా స్నేహితుడు. అక్టోబర్ 6న థియేటర్లలో ఈ సినిమా చూసి మీరంతా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “సితార బ్యానర్ ద్వారా లాంచ్ అవుతున్న దర్శకుడు కళ్యాణ్ కి ఆల్ ది బెస్ట్. సితారలో సినిమా చేస్తే బయటకు వెళ్ళాలి అనిపించదు. దానికి ఉదాహరణ నేనే. నేను మూడో సినిమా చేస్తున్నాను ఇప్పుడు. నిర్మాతగా పరిచయమవుతున్న హారికకి ఆల్ ది బెస్ట్. ముందుముందు మరిన్ని సినిమాలు నిర్మించాలి. నితిన్, రామ్, సంగీత్ ఈ ముగ్గురూ ఎక్కడికో వెళ్తారు. భీమ్స్ స్వరపరిచిన పాటలు ఎంతగానో నచ్చాయి.” అన్నారు.

ప్రముఖ యాంకర్ సుమ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, గీత రచయిత కాసర్ల శ్యామ్, ‘ఆదికేశవ’ దర్శకుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Siddu Jonnalagadda
  • #MAD

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

trending news

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

2 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

3 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

4 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

18 hours ago

latest news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

23 mins ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

1 hour ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

23 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version