రెండేళ్ళలో 1600 కోట్లు కొట్టారు.. చావా నిర్మాతల స్టన్నింగ్ బిజినెస్!

ఇటీవల బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు కూడా అంచనాలను అందుకోవడంలో విఫలమవుతున్న విషయం తెలిసిందే. అయితే స్టార్ పవర్‌కు బదులుగా కంటెంట్‌ను నమ్మి విజయాల బాటలో సాగుతున్న బ్యానర్ మాడాక్ ఫిల్మ్స్ సంచలనం సృష్టిస్తోంది. చిన్న సినిమాలైనా, భారీ రేంజ్ బిజినెస్ చేయడమే కాకుండా, తక్కువ బడ్జెట్‌లో హై ప్రాఫిట్ వసూలు చేయడంలో ఈ బ్యానర్ ముందంజలో ఉంది. 2024లో విడుదలైన స్త్రీ 2 (Stree 2) సినిమా కేవలం 100 కోట్లలోపే బడ్జెట్‌తో రూపొందినా, 874 కోట్ల గ్రాస్‌ను రాబట్టి బాలీవుడ్‌లో బిగ్ హిట్‌గా నిలిచింది.

Maddock Films

అదే తరహాలో ముంజ్యా సినిమా 30 కోట్ల బడ్జెట్‌తో 132 కోట్ల గ్రాస్ సాధించడంతో, మాడాక్ ఫిల్మ్స్ (Maddock Films) ట్రేడ్ వర్గాల్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. కేవలం ఈ రెండు సినిమాలే 1000 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన బడ్జెట్ సేఫ్ ప్రాజెక్టులుగా నిలిచాయి. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైన మాడాక్ ఫిల్మ్స్, 2025లో మరో భారీ హిట్ అందుకుంది. శంబాజి మహరాజ్ జీవిత ఆధారంగా వచ్చిన చావా (Chhaava) అనే చారిత్రక యాక్షన్ డ్రామా, 135 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఇప్పటివరకు 600 కోట్ల మార్క్‌ను దాటేసింది.

బాలీవుడ్ మార్కెట్‌లోనే కాకుండా, సౌత్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం గమనార్హం. థియేట్రికల్ బిజినెస్‌తో పాటు, ఇతర ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా కూడా నిర్మాతలకు భారీ లాభాలు వచ్చాయి. ఇలా చూసుకుంటే, మాడాక్ ఫిల్మ్స్ బాలీవుడ్‌లో రెండేళ్లలోనే 1600 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసిన బ్యానర్‌గా రికార్డు నెలకొల్పింది.

స్టార్ హీరోల పెద్ద సినిమాలు సైతం ఈ స్థాయిలో రాబట్టేందుకు కష్టపడుతుంటే, కేవలం కంటెంట్ బేస్డ్ సినిమాలతోనే వరుసగా 500 కోట్ల మార్క్ దాటడం ట్రేడ్ అనలిస్టులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి థామా, శక్తి శాలిని, స్త్రీ 3 వంటి క్రేజీ ప్రాజెక్టులు లైనప్‌లో ఉన్నాయి. హారర్, థ్రిల్లర్, మల్టివర్స్ సినిమాలుగా రాబోతున్న ఈ ప్రాజెక్టులపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సుకుమార్ చరణ్.. హీరోయిన్ ఫిక్స్ కాలేదు.. కానీ..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus