సుకుమార్ చరణ్.. హీరోయిన్ ఫిక్స్ కాలేదు.. కానీ..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ అంటేనే ఒక స్పెషల్ ఫీల్. రంగస్థలం (Rangasthalam) తర్వాత వీరిద్దరూ మళ్లీ క‌లిసి పనిచేయబోతున్నార‌నే వార్త రాబోయే సినిమా పై అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లింది. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ RC16  (RC 16 Movie)  షూటింగ్‌లో బిజీగా ఉండ‌గా, సుక్కు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్‌ వర్క్‌లో ఉంది. RC17 పేరుతో రూపొందబోయే ఈ సినిమా 2026లో సెట్స్‌పైకి వెళ్లనుంద‌ని సమాచారం. ఇదొక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది.

RC17

పుష్ప 2 (Pushpa 2) తర్వాత సుకుమార్ మ‌రింత భారీ స్థాయిలో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. అయితే మోస్ట్ డిస్కస్డ్ టాపిక్ ఏంటంటే, ఇందులో హీరోయిన్ ఎవరు? ఇందులో క‌థానాయికగా సమంతను (Samantha) తీసుకోవాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రంగస్థలంలో చిట్టిబాబు – రామలక్ష్మి కాంబో ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. కానీ సమంత ప్రస్తుతం తక్కువ సినిమాలు చేస్తుండటంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్, తీసుకు రాగలదా అన్నది ఓ అనుమానం.

అలాగే రష్మిక మందన్నా (Rashmika Mandanna) పేరు కూడా తెరపైకి వచ్చింది. పుష్ప సిరీస్‌లో హిట్ పెయిర్ కావడంతో రష్మికను తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ఆమె ఇప్పుడు ప్రతీ పాన్ ఇండియా సినిమాలో ఆమెనేనా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అలాగే, కొత్త నటిని తీసుకురావాలా లేక మరో క్రేజీ హీరోయిన్‌ను అనుకోవాలా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. సుకుమార్ కథకు బలమైన క్యారెక్టర్స్ ఎంచుకోవడంలో స్పెషలిస్టు.

అందుకే, స్టార్ హీరోయిన్ కాకపోయినా, క్యారెక్టర్‌కు న్యాయం చేసే యాక్ట్రెస్‌ను ఎంపిక చేసే అవకాశముంది. ఈ ప్రాజెక్ట్‌ 2027 లోనే విడుదల చేయాలని టీమ్ అనుకుంటోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా, కాస్టింగ్ అంశాలను కూడా త్వరలోనే లాక్ చేయనున్నారు. మ‌రి, ఫైనక్ గా సుకుమార్ – చ‌ర‌ణ్ కాంబోలో ఈసారి ఏ హీరోయిన్ ఫిక్స్ అవుతుందో చూడాలి.

ప్రభాస్ లిస్టులో దిల్ రాజు జటాయు!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus