తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ మూవీ ‘మదరాసి’ బాక్సాఫీస్ వద్ద డల్ పెర్ఫార్మన్స్ కొనసాగిస్తుంది. డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ వంటివి ఆకట్టుకోకపోవడంతో అంతగా బజ్ క్రియేట్ అవ్వలేదు.
దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ కూడా ఫామ్లో లేకపోవడం పైగా మొదటి షోతో నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద చప్పుడు చేయలేకపోయింది. మొదటి రోజు పర్వాలేదు అనిపించినప్పటికీ 2వ రోజు నుండి డౌన్ అయిపోయింది. 3వ రోజు కూడా అంతే..! ఇక 4వ రోజు అంటే మొదటి సోమవారం నాడు అయితే కలెక్షన్స్ సగానికి సగం పడిపోయాయి అని చెప్పాలి. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.0 cr |
సీడెడ్ | 0.30 cr |
ఉత్తరాంధ్ర | 0.34 cr |
ఈస్ట్+వెస్ట్ | 0.15 cr |
కృష్ణా + గుంటూరు | 0.33 cr |
నెల్లూరు | 0.08 cr |
ఏపి+ తెలంగాణ(టోటల్) | 2.2 cr(షేర్) |
‘మదరాసి’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.9.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.2.2 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.75 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.7.8 కోట్ల షేర్ ను రాబట్టాలి. వీకెండ్ ను ఈ సినిమా క్యాష్ చేసుకోలేకపోయింది.. మొదటి సోమవారం అయితే కలెక్షన్స్ సగానికి సగం పడిపోయాయి. మరి వీక్ డేస్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.