Madharasi Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘మదరాసి’

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన యాక్షన్ మూవీ ‘మదరాసి’.రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. అనిరుధ్ సంగీతంలో రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ అంతగా బజ్ క్రియేట్ చేయలేకపోయాయి.దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ ఫామ్లో లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి.

Madharasi Collections

కానీ శివ కార్తికేయన్ ఉన్న సూపర్ ఫామ్ కారణంగా అతని అభిమానులు ఈ సినిమా కోసం వెయిట్ చేశారు. అయితే మొదటి రోజు మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది ‘మదరాసి’. రివ్యూస్ అయితే చాలా వరకు నెగిటివ్ గానే వచ్చాయి. అయినప్పటికీ మొదటి రోజు పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ను నమోదు చేసింది. కానీ 2వ రోజు నుండి డౌన్ అయ్యింది. ఆదివారం కూడా ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేదు. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  0.90 cr
సీడెడ్  0.26 cr
ఉత్తరాంధ్ర  0.32 cr
ఈస్ట్+వెస్ట్ 0.14 cr
కృష్ణా + గుంటూరు  0.30 cr
నెల్లూరు 0.07 cr
ఏపి+ తెలంగాణ(టోటల్) 1.99 cr(షేర్)

 

‘మదరాసి’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.9.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.1.99 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.35 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.8.01 కోట్ల షేర్ ను రాబట్టాలి. వీకెండ్ ను ఈ సినిమా క్యాష్ చేసుకోలేకపోయింది. ఇప్పుడు వీక్ డేస్ లో కూడా ఇదే స్థాయిలో క్యాష్ చేసుకుంటే తప్ప బ్రేక్ ఈవెన్ కష్టంగానే కనిపిస్తుంది.

డిజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ కొత్త చిత్రం చిలకా ప్రొడక్షన్స్ లో రాగ్ మయూర్ హీరోగా ప్రారంభం

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus