హీరోలు.. విలన్లుగా మారడం ఇప్పుడు కొత్త విషయమేమీ కాదు. చాలామంది అలా డ్యూయల్ రోల్ పోషించారు, పోసిస్తున్నారు, పోషిస్తారు కూడా. దక్షిణాదిలో ఈ సంస్కృతి కొంచెం తక్కువే. చేసిన ఆ కొద్దమందిలో మాధవన్ ఒకరు. హీరోయిజాన్ని ఎంత అందంగా పండించాడో, విలనిజాన్నీ అంతే అందంగా చేసి మెప్పించాడు మాధవన్. ఇప్పుడు మరోసారి తెలుగులో విలన్ కాబోతున్నాడు. అయితే ఇక్కడో ఆసక్తికర అంశం ఉంది. మాధవన్ కెరీర్లో హిట్ సినిమాలు అంటే ‘రన్’, ‘వేట్టై’ అని చెప్పాలి. ఈ రెండు సినిమాలకూ లింగుస్వామినే దర్శకుడు.
అంటే మాధవన్‌కు హీరోగా మంచి విజయాలు అందించిన లింగుస్వామే ఇప్పుడు మాధవన్‌ను మరోసారి విలన్‌ను చేస్తున్నాడు. మరి లింగుస్వామి హీరోగా అదరగొట్టిన మాధవన్, విలన్‌గా ఎలా చేస్తాడో చూడాలి. అన్నట్లు లింగుస్వామి సినిమాల్లో విలన్ పాత్ర కూడా ఇంపార్టెంట్గానే ఉంటుంది. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. ఇది రామ్ 19వ సినిమా. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఇందులో కృతి శెట్టి ఓ కథానాయికగా నటిస్తోంది. మరో హీరోయిన్‌కూ ఛాన్స్ ఉందని సమాచారం.
మరోవైపు సినిమాలో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని కొందరు, పోలీసు సినిమా అని ఇంకొందరు అంటున్నారు. ఈ రెండు రకాల సినిమాలూ లింగుస్వామి చక్కగా చేయగలరు. మరి రామ్ ఏ కథ ఎంచుకున్నారో త్వరలో తెలుస్తుంది.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!