Madhubala: ‘శాకుంతలం’ రిజల్ట్ చాలా బాధపెట్టిందంటున్న నటి మధుబాల!

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శాకుంతలం’ సినిమా ఏప్రిల్ 14 న తెలుగుతో పాటు మలయాళ, తమిళ,హిందీ,కన్నడ భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కాళిదాసు రచ్చించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ని ఆధారం చేసుకుని తెరకెక్కింది. మోహన్ బాబు, గౌతమి, అనన్య నాగళ్ళ, వంటి వారు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో శకుంతల తల్లిగా అంటే మేనక పాత్రను మధుబాల పోషించింది.

తన కూతుర్ని కష్టాల పాలు చేసి ఏమీ చేయలేని స్థితిలో పశ్చాత్తాప్పడుతూ (Madhubala) ఈమె చాలా చక్కగా నటించింది. అలా అని ఈమె పాత్ర ఎక్కువ నిడివి కలిగింది కాదు. అయితే ‘శాకుంతలం’ రిజల్ట్ గురించి ఈమె కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అయినట్టు కనిపిస్తుంది. మధుబాల .. ‘శాకుంతలం’ రిజల్ట్ పై స్పందిస్తూ.. “దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడం నన్ను ఎంతగానో బాధపెట్టింది.

ప్రీ-ప్రొడెక్షన్ స్టేజి నుండి సినిమా రిలీజ్ అయ్యేవరకూ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. సినిమా పూర్తైన తర్వాత ఒక ఏడాది సీజీ వర్క్ కోసమే శ్రమించారు. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వాలని పరితపించారు. షూటింగ్ టైంలో నటీనటులు, టెక్నీషియన్లకు ఎలాంటి ఒత్తిడిని ఇవ్వలేదు. ప్రశాంతంగా వర్క్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. పురాణాలను ఆధారంగా చేసుకుని ‘శాకుంతలం’ ని తెరకెక్కించారు.

‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్.. మంచి విజయాలు అందుకున్నాయి. వాటి విజయాలకు సరైన కారణం అయితే లేదు. కానీ మా సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవ్వడానికి కారణాలేంటో తెలీదు. ఈ ఫలితాన్ని మేము అస్సలు ఊహించలేదు” అంటూ మధు చెప్పుకొచ్చింది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus