ఈమధ్య సౌత్ ఇండస్ట్రీలో నెగ్గుకురాలేకపోతున్న కథానాయికలందరూ.. క్యూ కట్టి మరీ బాలీవుడ్ లో రూపొందుతున్న సెక్స్ సినిమాలో నటించేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో మధురిమ కూడా చేరింది. తెలుగులో ఓ నాలుగైదు సినిమాల్లో నటించినప్పటికీ.. ఆమెకు సరైన గురింపు లభించలేదు.
అయితే.. “టెంపర్” సినిమాలో పోషించిన సిస్టర్ క్యారెక్టర్ మాత్రం ఆమెకు మంచి మంచి ఆఫర్లు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత ఒక రెండు మూడు ఆఫర్లు కూడా వచ్చాయి.
అయితే.. సదరు ఆఫర్లతో సంతృప్తి చెందని మధురిమ బాలీవుడ్ లో తెరకెక్కుతున్న తాజా బీగ్రేడ్ సెక్స్ ఫిలిం “ఒన్ నైట్ స్టాండ్”లో నటించింది. విశేషం ఏమిటంటే.. మధురిమ ఆ సినిమాలో నటించిందన్న విషయం, ఆమె చెప్పే వరకూ ఎవరికీ తెలియలేదు.
మరి “ఒన్ నైట్ స్టాండ్”లో మధురిమ క్యారెక్టర్ ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు!