Maha Samudram Trailer: పగబట్టిన పామును చంపటం ఒక్కటే మార్గం’

Advertisement

ఆర్ఎక్స్ 100 సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ సారి పూర్తిగా తన స్టైల్ కు భిన్నంగా మహా సముద్రం అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. హీరో శర్వానంద్, సిద్ధార్థ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అదితి రావ్ హైదరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఒక సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు.

ట్రైలర్ చూస్తుంటే సినిమా విభిన్నమైన ప్రేమకథతో పాటు హేవి ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ ఎపిసోడ్స్ కూడా గట్టిగానే ఉన్నట్లు అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత సిద్ధార్థ్ ఒక విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నాడు. సముద్రం చాలా గొప్పది మావ చాలా రహస్యాలను తనలోనే దాచుకుంటుంది.. అని శర్వా చెప్పిన డైలాగ్ తో సినిమాలోని పాత్రలు హైలెట్ గా నిలిచాయి. ఆ తర్వాత సిద్ధార్థ శర్వానంద్ అలాగే హీరోయిన్స్ మధ్యలో మంచి ప్రేమకథ కొనసాగినట్లు తెలుస్తోంది. ‘నువ్వు సముద్రం లాంటి వాడివి అర్జున్ నీలో కలవాలని అని నదులు కోరుకుంటాయి’ అని అదితీరావ్ చెప్పిన డైలాగ్ తో ఈ సినిమాలో హేవి ఎమోషనల్ లవ్ ట్రాక్ ఉందని అర్థమవుతోంది.

ఇక మరోవైపు థ్రిల్లింగ్ అనిపించే సిద్దార్థ్ క్యారెక్టర్, జగపతి బాబు రావు రమేష్ కూడా సీరియస్ గా కనిపిస్తున్నారు. అలాగే ‘పగబట్టిన పామును చంపటం ఒక్కటే మార్గం’ అంటూ జగపతి బాబు కూడా హై వోల్టేజ్ పాత్రలో కనిపిస్తున్నాడు. నిజంగా మహాసముద్రం లాంటి ఏమోషన్స్ తో అజయ్ భూపతి సరికొత్త కథను తెర పైకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను అక్టోబర్ 14న విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మరి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!


‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus