మహానటి ఫస్ట్ డే కలక్షన్స్

  • May 11, 2018 / 01:49 PM IST

“ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో మంచి అభిరుచిగల దర్శకుడనిపించుకున్న నాగ్ అశ్విన్ సావిత్రి జీవితంపై మహానటి అనే సినిమాను తెరకెక్కించి మరోసారి శెభాష్ అనిపించుకున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ తో కలిసి స్వప్న దత్ నిర్మించిన ఈ సినిమా మే 9న రిలీజ్ అయి మంచి చిత్రంగా పేరుతెచ్చుకుంది. సావిత్రిగా కీర్తి సురేష్ నటన అందరినీ ఆకట్టుకుంది. సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రకు దుల్కర్ సల్మాన్ న్యాయం చేశారు. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన పాటలతో పాటు నేపథ్యసంగీతంతో ప్రేక్షకుల మనసుదోచుకుంటున్నారు. అన్ని బాగా కుదిరిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 .9 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. షేర్ 3 .27 కోట్లు రాబట్టింది. ఏరియాల వారీగా కలక్షన్స్ వివరాలు.. (లక్షల్లో)

ఏరియా షేర్    గ్రాస్
నైజాం : 65      130సీడెడ్ : 14     20
ఉత్తరాంధ్ర : 18 వెస్ట్ గోదావరి : 6
ఈస్ట్ గోదావరి : 10
గుంటూరు : 9 కృష్ణ : 15
నెల్లూరు : 3
మొత్తం : 1 .4 కోట్లు 2 .5 కోట్లు అమెరికా : 1 . 87కోట్లు 3 .40 కోట్లు
మొత్తం : 3 . 27కోట్లు    5 .9 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus