Mahesh Achanta: ‘రంగస్థలం’ మహేష్ భార్య బేబీ బంప్ ఫోటోలు వైరల్

‘జబర్దస్త్’ ద్వారా పాపులారిటీ సంపాదించుకుని… ఆ వెంటనే మంచి నటుడిగా ఎదిగాడు మహేష్ ఆచంట. ‘జబర్దస్త్’ లో ‘కిరాక్ ఆర్పీ’ టీం ద్వారా పరిచయమైన మహేష్.. తర్వాత సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘శతమానం భవతి’ లో పల్లెటూరి కెమెరామెన్ గా చేసి మంచి మార్కులు వేయించుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చితక పాత్రలు చేసినప్పటికీ… ‘రంగస్థలం’ లో చరణ్ అసిస్టెంట్ గా చేసి సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

Mahesh Achanta

అటు తరువాత ‘మహానటి’ చిత్రంలో సావిత్రి దగ్గర పనిచేసి ఆస్తులు కాజేసే సత్యం అనే మేనేజర్ పాత్రలో జీవించాడు.అక్కడి నుండి మనోడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘గుణ 369’ ‘పాగల్’ ‘దాస్ క ధమ్కీ’ ‘కింగ్డమ్’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూనే వచ్చాడు.

ఇక 2020 కోవిడ్ టైంలో మహేష్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తమ బంధువుల్లోని కుటుంబానికి చెందిన పావని అనే అమ్మాయిని మహేష్ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు మొదటి సంతానంగా పాప జన్మించింది. తన పాప ఫోటోలు సోషల్ మీడియాలో మహేష్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటాడు. అలా మహేష్ ఫ్యామిలీ సోషల్ మీడియాలో చాలా ఫేమస్. అయితే అతని భార్య రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఫోటో షూట్ చేయించుకున్నట్టు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశాడు మహేష్. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం.. మహేష్ భార్యకి ఇటీవల డెలివరీ కూడా అయ్యిందని, అతనికి బాబు జన్మించినట్టు చెబుతున్నారు. అయితే ఎందుకో ఆ విషయాన్ని మహేష్ మీడియాకి రివీల్ చేసింది లేదు. అతని భార్య బేబీ బంప్ ఫోటోలు మాత్రం ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

6 నెలల గర్భిణితో పెళ్లి.. నెల తిరిగేసరికి పోలీస్ కేసు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus